• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Vijayawada Explosives Seized: విజయవాడలో భారీ పేలుడుకు ప్లానింగ్?! బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..ఏం జరుగుతోంది?

Vijayawada Explosives Seized: విజయవాడలో భారీ పేలుడుకు ప్లానింగ్?! బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..ఏం జరుగుతోంది?

Vijayawada Explosives Seized News: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నరసరావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు లగేజ్ బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు పొరపాటున మారిన వేరొకరి బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు కనిపించాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

Written ByHarish Darla
Published: Sep 15, 2026, 12:52 PM IST|Updated: Sep 15, 2026, 12:58 PM IST
joinshare
Vijayawada Explosives Seized: విజయవాడలో భారీ పేలుడుకు ప్లానింగ్?! బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..ఏం జరుగుతోంది?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijayawada Explosives Seized News: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులోస నరసరావుపేట నుంచి విజయవాడకు ప్రయాణించాడు. విజయవాడ చేరుకున్న తర్వాత బస్సు దిగిన అతను.. పొరపాటున తన బ్యాగ్‌కు బదులుగా మరొక ప్రయాణికుడి బ్యాగ్ తీసుకున్నాడు.

పేలుడు పదార్థాల గుర్తింపు..
కొంతసేపటికి ఆ బ్యాగ్ తెరిచి చూడగా.. అందులో అనుమానాస్పద పేలుడు పదార్థాలు ఉండడం గమనించాడు. దీంతో ఆసిఫ్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే విజయవాడ బస్టాండ్ సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్ట్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసుల తనిఖీలు, స్వాధీనం..
సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆసిఫ్ అలీ దగ్గర ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 46 జిలేటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్/ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి బస్సుతో పాటు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

దర్యాప్తు, భద్రతా చర్యలు..
పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనలో కృష్ణలంక ఎస్సై గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. అయితే ఈ పేలుడు పదార్థాలు బస్సులోకి ఎవరు తీసుకొచ్చారు. ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అస్సలు దీని వెనుక ఉన్న కారకులు ఎవరు? అనే అన్ని కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ బస్‌స్టాండ్‌లో దిగిన తర్వాత బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలు, బస్టాండ్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమాచారం అందించి పెను ప్రమాదాన్ని నివారించిన ప్రయాణికుడు ఆసిఫ్ అలీని పోలీసులు, ఆర్టీసీ అధికారులు అభినందించారు. ఈ ఘటన నేపథ్యంలో విజయవాడ నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వస్తువులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కృష్ణలంక పోలీసులు సూచించారు.

Also Read: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం..ఆ పార్టీ టార్గెట్‌ చేస్తూ జనసేనాని తెలంగాణ టూర్

Also Read: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40% ఛార్జీల మోత!

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

Add Zee News as a Preferred Source