SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

Silent Political Party: ఓ సీనియర్ నటుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. పంది ముఖం మాస్క్‌తో ఉన్న ఈ పోస్టర్ వెనుక ఎవరు ఉన్నారు..? ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో జరుగుతున్న ప్రచారం దేనికి సంకేతం..? వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 22, 2026, 17:49 IST | Updated: Nov 22, 2026, 17:51 IST
Image Credit: Silent Political Party (Source: X)
Join

Silent Political Party: రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త ముఖాలు తెరపైకి వస్తుంటాయి. పార్టీలు మారతాయి.. నాయకత్వాలు మారతాయి.. ఎన్నికల సమయంలో హామీలు కూడా కొత్తగా వినిపిస్తాయి. కానీ ప్రజల రోజువారీ సమస్యలకు మాత్రం పరిష్కారం దొరుకుతోందా..? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. వీటికి తోడు ఓ వింత పోస్టర్‌ కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది. గత రెండు రోజులుగా పంది ముఖాన్ని పోలిన మాస్క్‌తో ఉన్న పోస్టర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ల వెనుక ఉద్దేశం ఏమిటనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇటీవల ఓ సీనియర్ నటుడు రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ తెరుచుకోవడం చర్చకు దారితీసింది.

పంది ముఖాన్ని మాస్క్‌గా చూపిస్తూ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు..? ఇప్పటికే ప్రచారంలో ఉన్న ‘కాక్రోచ్ పార్టీ’ తరహాలో మరో వినూత్న రాజకీయ నిరసనకు తెరతీస్తున్నారా..? లేదా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారా? అనేన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు, లక్ష్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. రోజువారి దినపత్రికలలో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఓ సీనియర్ నటుడు రాజకీయ అరంగేట్రం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియాలో ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ అనే పేరుతో అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఈ సైలెంట్ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి..? పంది ముఖాన్ని మాస్క్ గా ధరించి ఏం చెప్పాలనుకుంటున్నారు..? కాక్రోచ్ పార్టీ లాంటి వాటికి పోటీగా తీసుకువస్తున్నారా..? ఎవరు టార్గెట్‌గా రాబోతున్నారు..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ పోస్టర్‌పై చర్చ కేవలం దినపత్రికలు, సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. ప్రముఖ ఆన్‌లైన్ చర్చా వేదిక Reddit‌లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీల్లో పంది ముఖం మాస్క్‌తో ఉన్న ఇదే పోస్టర్‌ను షేర్ చేస్తూ.. పాలకులు మారినంత మాత్రాన పాలనలో మార్పు వస్తుందా..? అంటూ ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌కు సంబంధించి ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, కాలుష్యం, నీటి కొరత వంటి సమస్యలను ప్రస్తావించగా.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, చిన్నారులపై నేరాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టులపై స్పందించిన కొందరు నెటిజన్లు నాయకులు మారడంతోనే సరిపోదని.. పాలనలో జవాబుదారీతనం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ప్రజల ఓటింగ్ విధానం, నాయకుల పనితీరు కూడా మార్పులో కీలకమని అన్నారు. దీంతో ఈ పంది ముఖం పోస్టర్ వెనుక రాజకీయ సందేశం ఏదైనా ఉందా..? అనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES