• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Visakha Vande Bharat Sleeper: ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ రైలు.. విశాఖ-బెంగళూరు వందేభారత్ రూట్, టైమింగ్ ఫిక్స్!

Visakha Vande Bharat Sleeper: ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ రైలు.. విశాఖ-బెంగళూరు వందేభారత్ రూట్, టైమింగ్ ఫిక్స్!

Visakha Bengaluru Vande Bharat Sleeper: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. ఇటీవలే కొత్త జోన్‌గా ఏర్పడిన విశాఖపట్నం నుంచి కర్ణాటక లోని బెంగళూరు వరకు వందేభారత్ స్లీపర్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్‌లో రైలు ప్రయాణాన్ని 18 నుంచి 20 గంటలు పడుతుండగా.. ఇప్పుడు దాన్ని కేవలం 14 గంటల్లోనే గమ్యాస్థానాన్ని చేరే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి.

Written ByHarish Darla
Published: Sep 19, 2026, 03:24 PM IST|Updated: Sep 19, 2026, 03:29 PM IST
joinshare
Visakha Vande Bharat Sleeper: ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ రైలు.. విశాఖ-బెంగళూరు వందేభారత్ రూట్, టైమింగ్ ఫిక్స్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Visakha Bengaluru Vande Bharat Sleeper: విశాఖపట్నం నుండి బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ స్లీపర్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త స్లీపర్ సర్వీస్ ప్రారంభమైతే రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ రైళ్లలో ప్రయాణానికి 18 నుండి 20 గంటల సమయం పడుతుండగా, ఈ వందేభారత్ స్లీపర్ ద్వారా కేవలం 14 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. వారానికి ఆరు రోజులు నడిచేలా రూపొందించిన ఈ రైలు షెడ్యూల్, కీలక స్టేషఅన్ల సమయ వేళలు కూడా ఖరారయ్యాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరు వైపు వెళ్లే ప్రధాన రైళ్లకు ప్రయాణికుల నుంచి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుండి బెంగళూరుకు నడిచే సాధారణ రైళ్లలో ప్రయాణించడానికి దాదాపు 18 నుండి 20 గంటల సమయం పడుతోంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రవేశపెడుతున్న నూతన వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు కేవలం 14 గంటల వ్యవధిలోనే బెంగళూరు చేరుకోవచ్చు. ఈ రైలును వారానికి 6 రోజులు (ప్రతి సోమవారం మినహా) నడిపేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

విశాఖపట్నం నుండి బెంగళూరు రైలు సమయ వేళలు..
ఈ వందేభారత్ స్లీపర్ రైలు విశాఖపట్నంలో రాత్రి 08:15 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత రాత్రి 08:45 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి అర్ధరాత్రి 01:05 గంటలకు కృష్ణాకెనాల్ స్టేషన్‌కు, తెల్లవారుజామున 04:40 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 07:30 గంటలకు ధర్మవరం మీదుగా ప్రయాణించి ఉదయం 10:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

బెంగళూరు నుండి విశాఖపట్నం తిరుగు ప్రయాణ వేళలు..
తిరుగు ప్రయాణంలో ఈ రైలు బెంగళూరులో రాత్రి 08:00 గంటలకు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో రాత్రి 10:30 గంటలకు ధర్మవరం, అర్ధరాత్రి 01:02 గంటలకు నంద్యాల స్టేషన్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత తెల్లవారుజామున 04:55 గంటలకు కృష్ణాకెనాల్, ఉదయం 09:15 గంటలకు దువ్వాడ మీదుగా ప్రయాణించి ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా రైల్వే శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది.

Also Read: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లురద్దు..అక్కడ స్పెషల్ రైలు

Also Read: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source