• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

All Set To Flipkart Big Billion Days Sale From October 8th: పండుగలు వస్తుండడంతో భారతదేశం మొత్తం పండుగ వైబ్‌లో మునిగిపోయింది. దసరా పండుగ వస్తుండడంతో షాపింగ్‌ సందడి మొదలైంది. ఇక ఈ పండుగకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేందుకు నెటిజన్లు సిద్ధమయ్యారు. ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌కు సర్వం సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 11:25 PM IST|Updated: Oct 07, 2026, 11:29 PM IST
joinshare
Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం
Image Credit: Source: Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

Flipkart Big Billion Days: షాపింగ్‌ జాతర.. 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం

2

Telangana RTC: ఊర్లకు పోయేందుకు ఫికర్‌ పడక్కర్లేదు.. దసరాకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

3

Jayalalitha: బిడ్డ పుడితే ఇబ్బందులు వస్తాయని భయపడ్డారా.. శరత్ బాబు గురించి జయలలిత సంచలన వ్యాఖ్యలు

4

World End: నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా.. వైరల్ అవుతున్న పాత రీసెర్చ్..

5

Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Big Billion Days Sale 13th Edition: ప్రధాన పండుగల సందడి మొదలవడంతో భారతదేశంలో ఆ వైబ్‌ ప్రారంభమైంది. పండుగల కోసం ప్రజలంతా షాపింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ షాపింగ్‌ ఉత్సవం నిర్వహించనుంది. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవానికి వేళయ్యింది. పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు భారీ నియామకాలు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఉత్సవం కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున షాపింగ్‌ జరగనున్న ఈ ఉత్సవం కోసం ఫ్లిప్‌కార్టు భారీ ప్రణాళిక రూపొందించింది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ అతిపెద్ద సేల్‌ ది బిగ్ బిలియన్ డేస్ 2026ను ప్రకటించగా.. ఇది 13వ ఎడిషన్. ప్లస్, బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు సభ్యులకు అక్టోబర్ 8వ తేదీ నుంచి ఎర్లీ యాక్సెస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌కు సంబంధించి ఆ సంస్థ సీఈఓ కీలక ప్రకటన చేశారు.

ది బిగ్ బిలియన్ డేస్ 13 ఏళ్ల కిందట ప్రారంభమవగా.. ఇది భారతదేశపు అతి పెద్ద పండుగ షాపింగ్‌ సేల్‌గా గుర్తింపు పొందింది. ఈ సేల్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత నడిచే షాపింగ్ అనుభవాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందించబోతున్నది. ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ అత్యంత విస్తృతమైన సప్లై చెయిన్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 8,200కు పైగా ఫుల్‌ ఫిల్‌మెంట్ కేంద్రాలు డెలివరీ సదుపాయాలకు సంస్థ విస్తరించింది.

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 'భారతదేశంలో డిజిటల్ కామర్స్ అనేది ఒక కొత్తదనం. 50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 14 లక్షల విక్రేతలు భాగమయ్యారు' అని తెలిపారు. బిగ్‌ బిలియన్‌ డేస్‌కు ఈ ఏడాది తొలిసారిగా కొండ ప్రాంతమైన లేహ్, కార్గిల్‌ని ప్రాంతాలకు వస్తు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు. బిగ్‌ బిలియన్‌ డేస్‌ కోసం దాదాపు 75,000 మందిని నియమించుకునట్లు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వివరించారు.

బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో నిత్యావసరాలతోపాటు ఎలక్ట్రానిక్స్, ప్రీమియం ఫ్యాషన్, బ్యూటీ, భారీ అప్లయన్స్‌లు, పండుగ బహుమతుల వరకు అన్నీ అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి కేటగిరీలోని బ్రాండ్ల నుంచి 15 కోట్ల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి‌ వెల్లడించారు. తాజా సీజన్‌లో మొబైల్స్, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మిషన్లు, వంటి భారీ అప్లయన్స్‌లు, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌లో విస్తృతమైన కొత్త లాంచ్ లైనప్ ఉండనుందని తెలిపారు. బిగ్‌ బిలియన్‌ డేస్‌లో 1,200 పైగా ఫ్యాషన్ ట్రెండ్‌ ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News
Trending News