• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Amazon Great Indian Sale: కొత్త ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ తగ్గింపుతో ఎర్లీ డీల్స్!

Amazon Great Indian Sale: కొత్త ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ తగ్గింపుతో ఎర్లీ డీల్స్!

Amazon Great Indian Sale 2026: రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఫెస్టివల్ 2026ను ప్రారంభించనుంది. 2026 అక్టోబరు 8 నుంచి అధికారికంగా ఈ సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ముందస్తు ఆఫర్లు కొన్ని నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దాదాపుగా 80 శాతం తగ్గింపుతో, SBI కార్డులు, అమెజాన్ పేని ఉపయోగించి, అదనపు డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ పొందవచ్చు.

Written ByHarish Darla
Published: Sep 27, 2026, 01:28 PM IST|Updated: Sep 27, 2026, 01:33 PM IST
joinshare
Amazon Great Indian Sale: కొత్త ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ తగ్గింపుతో ఎర్లీ డీల్స్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amazon Great Indian Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిర్వహించే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 8న ప్రధాన సేల్ ప్రారంభం కాకముందే ఇప్పుడు కొన్ని ఎర్లీ డీల్స్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులకు అందుబాటులో లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు ఉండగా.. హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం, అలాగే నిత్యవసర వస్తువులపై 50 శాతం వరకు తగ్గింపును ఆ సంస్థ ప్రకటిస్తోంది.

స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల ప్రత్యేక ధరలు..
మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఫ్లాగ్‌షిప్, బడ్జెట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ సాధనాలపై ప్రత్యేక తగ్గింపు ధరలు నిర్ణయించారు. 
OnePlus N6x (7,000mAh బ్యాటరీ): సాధారణ ధర రూ.19,999 ఉండగా.. దీని స్పెషల్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో దాదాపుగా రూ. 18,499 ధరకే లభించనుంది.

iQOO Z10 Lite 5G: ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రారంభ ధర రూ.18,999 నుంచి అందుబాటులో ఉండగా.. దీనిపై స్పెషల్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లతో రూ.15,999కి ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇతర ఫోన్లు: హై-పెర్ఫార్మెన్స్ ఫోన్ iQOO Neo 10 రూ.41,999కి లభిస్తుండగా, బడ్జెట్ మోడల్ Lava Bold N2 రూ.8,729కి అందుబాటులో ఉంది.

గ్యాడ్జెట్లు: ఆపిల్ 2026 మ్యాక్‌బుక్ Neo 13 ల్యాప్‌టాప్ రూ. 71,990కి, ASUS Vivobook 15 రూ.59,990కి లభిస్తుండగా.. OnePlus Watch 2R రూ.9,999కి లభిస్తున్నాయి. అలాగే Marshall Acton III ఆడియో స్పీకర్ రూ.27,999 తగ్గింపు ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

స్మార్ట్ టీవీలు, కెమెరాలు, గృహోపకరణాలు: 
అలాగే ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్ పరికరాలపైనా ప్రత్యేక డీల్స్ ఉన్నాయి

టీవీలు: శాంసంగ్ 55-inch Mini LED 4K Vision AI TV రూ.53,900కి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా.. టీసీఎల్ కంపెనీకి చెందిన 55-inch QD-Mini LED Google TV రూ.62,990కు, అలాగే ఎల్‌జీ 55-inch NU87 AI webOS TV రూ.45,990 తక్కువ ధరకే లభిస్తోంది.

కెమెరా, గృహోపకరణాలు..
సోనీ Alpha ILCE-6700 మిర్రర్‌లెస్ కెమెరా రూ.1,25,990కి లభిస్తోంది. గృహోపకరణాలలో శాంసంగ్ 653L AI స్మార్ట్ రీఫ్రిజ్‌రేటర్ రూ.82,990కి, Bosch 8kg Front-Load Washing Machine రూ.31,490కి దొరుకుతున్నాయి.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు..
SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు లేదా EMI ద్వారా లావాదేవీలు జరిపితే 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడే ప్రైమ్ సభ్యులకు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ సదుపాయం కల్పించారు.

అర్హత ఉన్న వారికి రూ.2,500 వరకు వెల్‌కమ్ బెనిఫిట్స్‌తో పాటు, అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.1,500 కన్నా ఎక్కువ ఆర్డర్లపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 3 నెలల వడ్డీ రహిత EMI పొందే అవకాశం ఉంది.

గమనిక: అక్టోబర్ 8న అమెజాన్ అసలైన సేల్ ప్రారంభమయ్యే రోజుల్లో మరిన్ని డీల్స్ వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వస్తువుల లభ్యత, బ్యాంక్ ఆఫర్ల నిబంధనలను బట్టి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు యాప్‌లో చివరి ధరను సరిచూసుకోవడం మంచిది.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News