SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

Ansal API Promoters EGM Cancelled: అన్సల్‌ ఏపీఐ ప్రమోటర్ల సర్వసభ్య సమావేశం అకస్మాత్తుగా రద్దయ్యింది. సమావేశం నిర్వహించడానికి కావాల్సిన కోరమ్‌ లేక సమావేశం రద్దవగా.. తెరపైకి ఈ-ఓటింగ్‌ విధానం చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 23, 2026, 22:38 IST | Updated: Nov 23, 2026, 22:41 IST
Image Credit: Ansal API EGM Cancelled
Join

Ansal API EGM: అన్సల్‌ గ్రూప్‌నకు సంబంధించిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహించాలనుకుంటే పెద్ద ఎత్తున సభ్యులు హాజరుకాకకపోవడంతో సమావేశం రద్దయ్యింది. సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రమోటర్లు ప్రణవ్ అన్సల్, సుశీల్ అన్సల్, ప్రమోటర్ గ్రూప్‌లోని ఇతర సభ్యులు కోరగా.. అయితే హాజరుకావాల్సిన సభ్యులు చాలా తక్కువ మందే హాజరయ్యారు. దీంతో కోరమ్‌ లేక ఈ సమావేశాన్ని రద్దు చేశారు. కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 103 ప్రకారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన కనీస కోరమ్‌ 30 మంది సభ్యుల సంఖ్య చేరుకోలేదు. ఈ కారణంతో సమావేశాన్ని రద్దు చేశారు.

అవసరమైన కోరం చేకూర్చుకోవడంలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ విఫలమవడంతో అన్సల్ ఏపీసీ ప్రమోటర్లు ప్రతిపాదించిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) సోమవారం ఎలాంటి తీర్మానాలు చేయకుండా.. వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే రద్దయింది. ఢిల్లీలోని ఏరోసిటీలో రోజేట్ హౌస్ హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశం రద్దు చేయడంతో ఈ సమావేశం మరోసారి జరగనుంది. సెక్షన్ 103 ప్రకారం చట్టబద్ధమైన హాజరు నిబంధన, రూల్ 20 ప్రకారం తప్పనిసరి ఈ-ఓటింగ్ నిబంధన నెరవేరకపోవడంతో ప్రతిపాదిత సర్వసభ్య సమావేశం మొదటి దశలోనే ఆగిపోయింది. ప్రమోటర్ల అజెండాపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సమావేశం నుంచి చెల్లుబాటయ్యే కార్పొరేట్ నిర్ణయం ఏదీ వెలువడలేదు.

కోరం ఎందుకు అవసరం?
అన్సల్ ఏపీఐకి 35,000 కంటే ఎక్కువ మంది వాటాదారులు ఉన్నారు. కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 103 ప్రకారం.. ఇంత పెద్ద సంఖ్యలో వాటాదారులు ఉన్న కంపెనీ సర్వసభ్య సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 30 మంది సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాలి. అవసరమైన హాజరు లేకపోవడంతో సమావేశం ముందుకు సాగలేకపోయింది. చెల్లుబాటయ్యే తీర్మానాలు లేదా కార్పొరేట్ నిర్ణయాలు లేకుండానే ముగిసింది.

ఈ-ఓటింగ్ వివాదం
రిమోట్ ఈ-ఓటింగ్ సౌకర్యం లేకపోవడంపై పబ్లిక్ వాటాదారుల నుంచి కూడా ఈ సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ-ఓటింగ్ లేకపోవడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న రిటైల్ వాటాదారుల ఓటు హక్కుకు భంగం వాటిల్లిందని మైనారిటీ ఇన్వెస్టర్లు వాదించారు.

లిస్టెడ్ కంపెనీలు, 1,000 లేదా అంతకంటే ఎక్కువ మంది వాటాదారులు ఉన్న కంపెనీలకు రిమోట్ ఈ-ఓటింగ్‌ను కంపెనీల (నిర్వహణ, పరిపాలన) నియమాలు, 2014లోని రూల్ 20 తప్పనిసరి చేస్తుంది. కంపెనీలు సాధారణంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 108, రూల్ 20, సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం రిమోట్ ఈ-ఓటింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. సమావేశ వేదిక వద్ద ఉన్న వారి ప్రకారం తప్పనిసరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ లేకపోవడం, చట్టబద్ధమైన కోరమ్‌ లేకపోవడంతో పబ్లిక్ వాటాదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలతో సమావేశ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

కోరమ్‌ అంటే ఏమిటి?
కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 103 పబ్లిక్ కంపెనీలకు కోరమ్‌ అంటే ఏమిటో నిర్వచిస్తుంది. ఇది ఆ కంపెనీ మొత్తం సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక కంపెనీ సమావేశం నిర్వహించాలంటే.. చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలంటే కనీసం ఎంత మంది వాటాదారులు లేదా సభ్యులు హాజరు కావాలో కోరమ్‌ నిర్ణయిస్తుంది. అవసరమైన సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

ప్రాథమిక అవసరాలు
- ఒక సమావేశం అనుకున్న విధంగా జరగాలంటే కంపెనీకి ఈ కింది అంశాలు తప్పనిసరిగా ఉండాలి

- పరిశీలించాల్సిన తేదీ, సమయం, వేదిక, అంశాలను పేర్కొంటూ వాటాదారులకు సక్రమంగా జారీ చేసిన నోటీసు

- నిర్ణీత సమయానికి హాజరైన అవసరమైన కోరమ్‌

- సమావేశాన్ని నిర్వహించడానికి ఒక చైర్‌పర్సన్ అవసరం

- అవసరమైన చోట రిమోట్ ఈ-ఓటింగ్‌తో సహా వర్తించే ఓటింగ్ విధానం పాటించడం

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES