• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్ నియామకం..!!

ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్ నియామకం..!!

Nvidia CEO: ప్రముఖ చిప్ తయారీ, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా సంస్థ తమ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది.

Written ByBhoomi
Published: Nov 23, 2026, 20:51 IST|Updated: Nov 23, 2026, 20:53 IST
joinshare
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్ నియామకం..!!
Image Credit: Nvidia CEO

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
హరీశ్ రావు అసలు గురువు కేసీఆర్ కాదు.. వైఎస్ఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

హరీశ్ రావు అసలు గురువు కేసీఆర్ కాదు.. వైఎస్ఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

2

ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్ నియామకం..!!

3

బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి..!!

4

Rice Price In India: బియ్యం ధరల పెరుగుదలకు చెక్ పెట్టనున్న కేంద్రం..బియ్యం ఎగుమతులపై ఆంక్షలకు సిద్ధం!

5

Trisha: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం.. త్రిష పేరుతో కొత్త పార్టీ ప్రకటన.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nvidia CEO: ప్రముఖ చిప్ తయారీ, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా  సంస్థ తమ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ ఆమోదంతో ఆయన వెంటనే తిరిగి సంస్థ బాధ్యతలను స్వీకరించారు. సీఈవో పదవితో పాటు, ఆయన ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా కూడా కొనసాగనున్నారని సంస్థ ప్రకటించింది.

జెన్సన్ హువాంగ్ విదేశీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కు లక్ష్యంగా మారారన్న కథనాలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టపరమైన నిపుణుల సహాయంతో సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల నుంచి కూడా బోర్డు కీలక సమాచారాన్ని సేకరించింది. అనంతరం హువాంగ్ తిరిగి విధుల్లో చేరడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని నిర్ధారించుకున్నట్లు సంస్థ తెలిపింది. బోర్డుతో పలు దఫాలుగా జరిగిన విస్త్రుత సమావేశాల తర్వాత.. సంస్థను సమర్ధవంతంగా నడిపించేందుకు ఆయనకున్న నాయకత్వ పటిమ, నిబద్ధతపై బోర్డు పూర్తి సంత్రుప్తి వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా.. ఎన్విడియా బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఎన్విడియాను సరైన దిశలో నడిపించడానికి జెన్సన్ హువాంగ్ సరైన వ్యక్తి అని బోర్డు గట్టిగా విశ్వసిస్తోంది. ఆయన తిరిగి రావడం మన వాటాదారులకు, ఉద్యోగులకు, భాగస్వాములకు,  వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది." హువాంగ్ గైర్హాజరీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) తాత్కాలిక CEOగా పనిచేసిన కొలెట్ క్రెస్‌కు జోన్స్ ధన్యవాదాలు తెలిపారు.

తన పునరాగమనంపై స్పందిస్తూ..  జెన్సన్ హువాంగ్, ఒక కొత్త పారిశ్రామిక విప్లవం జరుగుతున్న ఈ కీలక సమయంలో ఎన్విడియాకు మళ్లీ నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.  "నేను ఈ బాధ్యతను అత్యంత వినయంతో, నూతన అంకితభావంతో స్వీకరిస్తున్నాను. ఈ సమయంలో అచంచలమైన మద్దతు అందించిన బోర్డు సభ్యులకు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు, ఉద్యోగులకు, వాటాదారులకు, పరిశ్రమకు.. ప్రపంచ భాగస్వాములకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికన్నా ముఖ్యంగా, నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. కంపెనీ కోసం తిరిగి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. 

మనం బంగారం కొనకపోతే రేట్లు దిగొస్తాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలను శాసించే అసలు శక్తులు ఏవో తెలిస్తే షాకవుతారు..!!

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.. బ్యాంకు SMS ల వెనుక అసలు కథ ఇదే..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News