Lava Smart 4 Pro Launch Price In India: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారతీయ మొబైల్ బ్రాండ్ లావా మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.10,999 ధరతో లభిస్తున్న ఈ మొబైల్ ప్రధానంగా భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
లావా స్మార్ట్ 4 ప్రో డిజైన్, డిస్‌ప్లే..
లావా స్మార్ట్ 4 ప్రో బ్యాక్ డిజైన్, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కారణంగా ఐఫోన్‌ను పోలిన రూపాన్ని కలిగి ఉంది. అయితే, ఈ ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో తయారు చేశారు. ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ అందించారు. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటం కూడా ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సాధారణ ఫోన్లతో పోలిస్తే స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉండేందుకు ఈ రిఫ్రెష్ రేట్ ఉపయోగపడుతుంది.
భారీ బ్యాటరీ, ప్రాసెసర్
ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీని అందించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించే వారికి, తరచుగా ఛార్జింగ్ పెట్టుకోవడం ఇష్టపడని వారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉండొచ్చు. 18W ఛార్జింగ్ సపోర్ట్, USB Type-C పోర్ట్ కూడా ఉన్నాయి. UNISOC T610 ఆక్టా - కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 4GB RAM, 64GB స్టోరేజ్ అందించారు. వర్చువల్ RAM ద్వారా మరో 4GB వరకు అదనపు మెమరీ సదుపాయం లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా, సాఫ్ట్‌వేర్, భద్రత
ఫోటోలు తీసేందుకు 13MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Android 16తో వస్తున్న ఈ ఫోన్‌లో అనవసర యాప్స్, ప్రకటనలు ఉండవని కంపెనీ చెబుతోంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ద్వారా భద్రత కల్పించారు. నీలం బ్లూ, కోణార్క్ గోల్డ్ రంగుల్లో లభించే Lava Smart 4 Proపై ఒక సంవత్సరం వారంటీ ఉంది. ఇంటి వద్ద సర్వీస్ సదుపాయం కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ.10,999 ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కోరుకునే వారికి ఇదో మంచి ఎంపికగా నిలుస్తోంది.
(గమనిక: ఈ కథనం కేవలం పాఠకాసక్తి కోసం మాత్రమే పొందుపరిచినది. ఇది ఏమాత్రం ప్రాజియోజిత కథనం కానేకాదు. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్లో ఇతర మోడల్స్‌ను సరిపోల్చుకొని కొనుగోలు చేయడం ఉత్తమం.)