SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bank Strike Postpone: నేడు యథావిధిగా బ్యాంకులు.. మూడు రోజుల సమ్మెకు బ్రేక్‌!

Bank Strike Immediate Break After Talks With IBA: బ్యాంకు సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపట్టాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఐదు రోజుల పని దినాలకు కదలిక వచ్చిందని.. దీంతో ప్రస్తుతానికి తమ ఉద్యమం వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు తెలిపాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 28, 2026, 01:35 AM IST | Updated: Sep 28, 2026, 01:39 AM IST
Image Credit: Source: Zee Business Website
Join

Bank Strike Break: ఐదు రోజుల పనిదినాలతోపాటు పని ఒత్తిడి తగ్గించడం.. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో నేటి నుంచి జరగాల్సిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. మూడు రోజుల పాటు ప్రారంభం కావాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల తమ సమ్మె విరమించుకుంటున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

తమ పోరాటాన్ని వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీఐ) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఆదివారం రాత్రి 9.30 గంటలకు జరిగిన కీలక సమావేశంలో చర్చలు జరిగాయి. ఐబీఏ ముందు బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లు, సమస్యలు వివరించారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లతో పాటు పలు అంశాలపై ఐబీఏ ప్రతినిధులతో చర్చించారు.

ఈ చర్చలలో సానుకూల నిర్ణయాలు రావడంతో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు చేపట్టాల్సిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ ప్రకటన జారీ చేసింది. సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో నేడు సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి. మూడు రోజులపాటు బ్యాంకులు బంద్‌ ఉంటాయని భావించిన ఖాతాదారులు, వినియోగదారులకు ఊరట లభించింది. అయితే అర్ధరాత్రి సమ్మెను వాయిదా వేయడంతో బ్యాంకు ఉద్యోగులు గందరగోళంలో పడ్డారు. ఇంతకు ఏమీ జరిగింది? ఎందుకు అకస్మాత్తుగా వాయిదా వేశారని బ్యాంకు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

ఐదు రోజుల పనివిధానంపై కదలిక
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్‌ ఐదు రోజుల పనివిధానంపై కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పూట జరిగిన చర్చల్లో ఐబీఏ వారంలో రెండు సెలవులకు అంగీకరించినట్లు సమాచారం. తమకు సానుకూల నిర్ణయం రావడంతో వెంటనే బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES