SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Zepto, Blinkit నుంచి సరుకులు ఆర్డర్ చేస్తున్నారా..? ఈ కొత్త కార్డుపై బెస్ట్ ఆఫర్స్

Zepto Blinkit Offers: ఆన్‌లైన్‌లో Zepto, Blinkit లేదా Instamart ద్వారా నిత్యావసర సరుకులు తెప్పించుకునే వారికి ఒక అదిరిపోయే శుభవార్త. ఫెడరల్ బ్యాంక్, ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పైసాబజార్ సంయుక్తంగా ‘పైసాబ్యాక్ క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. క్యాష్‌బ్యాక్ వివరాలు, వార్షిక ఫీజులు వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Sep 12, 2026, 12:29 PM IST | Updated: Sep 12, 2026, 07:28 PM IST
Image Credit: Zepto Blinkit Offers (Source: File)
Join

Zepto Blinkit Offers: ప్రస్తుతం Blinkit, Zepto, Instamart లేదా ఇతర క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తమకు కావాల్సిన వస్తువులను నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తుండడంతో ఎక్కువమంది వినియోగదారులు ఈ యాప్స్‌పై ఎక్కువ ఆధారపడుతున్నారు. మీరు కూడా బ్లింకిట్, జెప్టో వంటి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తుంటే.. మీ కోసం ఒక కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చేసింది. ఫెడరల్ బ్యాంక్, పైసాబజార్ కలిసి ఎంపిక చేసిన కిరాణా కొనుగోళ్లపై 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందించే ఒక క్రెడిట్ కార్డును తీసుకువచ్చాయి. Paisabazaar Paisaback క్రెడిట్ కార్డు పేరిట వచ్చిన ఈ కార్డు RuPay నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. దీని ద్వారా కేవలం ఆన్‌లైన్ గ్రోసరీ ఆర్డర్లపైనే కాకుండా ఇతర ఖర్చులపై కూడా వివిధ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్‌లు లభించనున్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్దేశిత ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేసినప్పుడు ఆఫర్లు వర్తిస్తాయి.

ఆఫర్లు వర్తించే ప్లాట్‌ఫామ్స్ ఇవే..

ఈ కిరాణా కేటగిరీపై నెలకు గరిష్టంగా  రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అర్హత కలిగిన POS, ఈ-కామర్స్ లావాదేవీలపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని ఎంపిక చేసిన UPI లావాదేవీలపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. (గమనిక: గ్రోసరీ, ఇంధనం, ట్రావెల్ వంటి కొన్ని కేటగిరీలకు ఇది వర్తించదు). ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో గరిష్టంగా రూ.100 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. మీకు వచ్చే క్యాష్‌బ్యాక్ అంతా ఖాతాలో ‘క్యాష్ పాయింట్స్’ రూపంలో జమ అవుతుంది.

కార్డు ఛార్జీల వివరాలు ఇలా..

ఫీజు మినహాయింపు: ఏడాదిలో కనీసం  రూ.1.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక ఫీజు పూర్తిగా రద్దవుతుంది. మీరు నెలకు సుమారుగా రూ.10 వేల విలువైన కిరాణా కొనుగోళ్లు చేస్తే, 7.5 శాతం చొప్పున దాదాపు  రూ.750 క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఒకవేళ మీ ఖర్చు రూ.13,333 అయితే గరిష్టంగా రూ.1,000 క్యాష్‌బ్యాక్ పూర్తిగా లభిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES