SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

D-Mart Vendor: డీమార్ట్‌తో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? చిన్న వ్యాపారమైనా రూ.లక్షల్లో రాబడి!

D-Mart Vendor Registration: ప్రతినెలా నిత్యవసరాల కోసం సామాన్యుడికి అందుబాటులో ఉండే డీమార్ట్‌తో మీరు కూడా వ్యాపారం చేయవచ్చు. మీరు ఏదైనా వస్తువులను తయారు చేస్తున్నట్లయితే, వాటిని సేల్ చేసేందుకు మీరు డీమార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Oct 03, 2026, 10:27 PM IST | Updated: Oct 03, 2026, 10:30 PM IST
Join

D-Mart Vendor Registration: సాధారణంగా డీమార్ట్ అంటే తక్కువ ధరలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నిత్యావసర సరుకుల కొనుగోలు వేదికగా అందరికీ పరిచయం. అయితే, చిన్న వ్యాపారులు, తయారీదారులు తమ సొంత ఉత్పత్తులను డీమార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు. డీమార్ట్ కొత్త స్టోర్లకు ఫ్రాంచైజీలు ఇవ్వనప్పటికీ, చిన్న తయారీదారులను వెండార్లుగా ఆహ్వానిస్తుంది. అవసరమైన ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్న వ్యాపారులు డీమార్ట్‌‌తో ఒప్పందం కుదుర్చుకుని తమ బిజినెస్‌ను ఊహించని స్థాయిలో విస్తరించవచ్చు.

మార్కెటింగ్ డిమాండ్..
గ్రామాలు లేదా చిన్న పట్టణాల్లో సొంతంగా ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలు, గృహోపకరణాలు తయారుచేసే చిన్న సంస్థలకు మార్కెటింగ్ అనేది ప్రధాన సవాలుగా మారుతుంది. కేవలం స్థానిక దుకాణాలకే విక్రయాలు పరిమితమైతే వ్యాపారంలో పెద్దగా ఎదుగుదల ఉండదు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా వందలాది స్టోర్లు ఉన్న డీమార్ట్ వంటి పెద్ద రిటైల్ సంస్థలో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తే అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి.

డీమార్ట్‌లో ఉత్పత్తులను విక్రయించాలనుకునేవారు మూడు కీలక ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది
1) ధర - నాణ్యత..
ప్రముఖ బ్రాండెడ్ ఉత్పత్తులకు ఏమాత్రం తగ్గని నాణ్యతను కలిగి ఉంటూనే, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆకర్షణీయమైన ధరను నిర్ణయించాలి.

2) ఆకర్షణీయమైన ప్యాకింగ్.. 
రవాణా సమయంలో సరుకులు దెబ్బతినకుండా చూసుకోవడంతో పాటు, వినియోగదారులను చూడగానే ఆకట్టుకునేలా ప్యాకేజింగ్ ప్రమాణాలు ఉండాలి.

3) ఉత్పత్తి సామర్థ్యం.. 
డీమార్ట్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాక వేలాది ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజువారీ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయగల తయారీ సత్తా ఉండటం తప్పనిసరి.

4) వ్యాపారానికి అవసరమైన పత్రాలు.. 
డీమార్ట్‌తో బిజినెస్ డీల్ కుదుర్చుకోవడానికి జీఎస్టీ (GST), వ్యాపార పాన్ (PAN) నంబర్ అవసరం. పచ్చళ్లు, అప్పడాలు, పొడులు, పిండి పదార్థాలు వంటి ఆహార ఉత్పత్తులకు భారత ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇతర గృహోపకరణాలు లేదా సాధనాలకైతే ప్రభుత్వ సంబంధిత టెస్టింగ్ లేదా BIS ధ్రువీకరణలు పొంది ఉండాలి. చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే 'ఉద్యమ్ సర్టిఫికెట్' ఉంటే అదనపు ప్రయోజనం లభిస్తుంది.

5) లాభం, అప్లై చేసుకునే విధానం.. 
డీమార్ట్‌లో ఒక్కో వస్తువుపై లభించే మార్జిన్ కంటే భారీ సంఖ్యలో జరిగే అమ్మకాల (Volume Sales) వల్లనే అసలైన లాభం సమకూరుతుంది. నెలకు కొన్ని వందల ప్యాకెట్లు మాత్రమే విక్రయించే చిన్న సంస్థలు, డీమార్ట్ ద్వారా వేలాది యూనిట్లను అమ్మి తక్కువ సమయంలోనే బ్రాండ్‌గా ఎదుగుతాయి. ఆసక్తి ఉన్నవారు డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ (dmartindia.com) లోని 'Partner With Us' విభాగం ద్వారా తమ తయారీ వివరాలు, ప్రొడక్ట్ కేటలాగ్ సమర్పించవచ్చు. దరఖాస్తు ఆమోదం తెలిపితే ప్రొడక్ట్ శాంపిల్స్ పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు సరిపోలితే సరఫరా ఒప్పందం చేసుకుంటారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES