• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Dmart Saving Tips: డీమార్ట్‌లో షాపింగ్ చేసే వాళ్లకు సూపర్ సేవింగ్ టిప్స్..ఇలా చేస్తే వేల రూపాయలు ఆదా!

Dmart Saving Tips: డీమార్ట్‌లో షాపింగ్ చేసే వాళ్లకు సూపర్ సేవింగ్ టిప్స్..ఇలా చేస్తే వేల రూపాయలు ఆదా!

Dmart Shopping Saving Tips: సిటీల్లో మధ్యతరగతి కుటుంబాల షాపింగ్ మాల్‌గా పేరొందిన డీమార్ట్‌లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఇందులో నిత్యావసరాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభిస్తాయి. అయితే కొన్ని స్మార్ట్ షాపింగ్ టిప్స్ పాటించడం ద్వారా మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఆఫర్లు చూడటం, షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోవడం, బల్క్ కొనుగోళ్లు, తక్కువ రద్దీ ఉండే రోజుల్లో వెళ్లడం.. డీమార్ట్ స్వంత బ్రాండ్‌ ఉత్పత్తులను ఎంచుకోవడం వంటి మార్గాల ద్వారా బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

Written ByHarish Darla
Published: Sep 15, 2026, 05:15 PM IST|Updated: Sep 15, 2026, 05:18 PM IST
joinshare
Dmart Saving Tips: డీమార్ట్‌లో షాపింగ్ చేసే వాళ్లకు సూపర్ సేవింగ్ టిప్స్..ఇలా చేస్తే వేల రూపాయలు ఆదా!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dmart Shopping Saving Tips: డీమార్ట్ అంటే అతి తక్కువ ధరలలో నిత్యావసర వస్తువులు లభించే ప్రదేశంగా అందరికీ సుపరిచితం. ఇక్కడ వంటగదికి కావలసిన వస్తువులు, ఇంటి ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, ఇతర సామగ్రి సులభంగా లభిస్తాయి. ఏడాది పొడవునా భారీ డిస్కౌంట్లు ఉన్నప్పటికీ, కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటిస్తే మరింత ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు.

1) ఆఫర్లు, డిస్కౌంట్లు వెతకాలి..
డీమార్ట్‌లో నిరంతరం కొత్త ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' (Buy One Get One Free) ఆఫర్ తరచూ ఉంటుంది. రెండు వస్తువులు వద్దనుకుంటే, ఆ వస్తువును సగం ధరకే పొందే వెసులుబాటు కూడా ఉంది. పండుగల సమయంలో ఇచ్చే భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల వివరాల కోసం వారి వెబ్‌సైట్ లేదా ఫ్లయర్స్ చూడవచ్చు.

2) టోకు (బల్క్) షాపింగ్ చేయండి.. 
బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు లాంటి త్వరగా పాడవని వస్తువులను బల్క్‌గా కొనడం వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ఉదాహరణకు, 5 కిలోల బస్తా బదులు 25 కిలోల బియ్యం బస్తా తీసుకుంటే తక్కువ ధరకు వస్తుంది. అయితే అవసరం లేని వస్తువులను కొని ఎక్స్‌పైరీ డేట్ దాటిపోతే నష్టం జరుగుతుందని గుర్తించాలి.

3) షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోండి..
ఇంటి నుండి బయలుదేరే ముందే షాపింగ్ లిస్ట్ (Shopping List) తయారు చేసుకోవడం తప్పనిసరి. లిస్ట్‌లో ఉన్న వస్తువులు మాత్రమే కొనడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి, బడ్జెట్ అదుపులో ఉంటుంది.

4) తక్కువ రద్దీ ఉన్న రోజుల్లో వెళ్లండి.. 
వారాంతాలు, నెల ప్రారంభంలో డీమార్ట్‌లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆఫర్లను సరిగ్గా చూడలేరు. వీలైనంత వరకు సోమవారం లేదా మంగళవారం వంటి రోజుల్లో వెళ్తే ప్రతీ సెక్షన్‌ను ప్రశాంతంగా చూసి మంచి డీల్స్ ఎంచుకోవచ్చు.

5) డీమార్ట్ బ్రాండ్ ఉత్పత్తులు వాడండి.. 
పెద్ద బ్రాండ్లతో పోలిస్తే డిమార్ట్ సొంత బ్రాండ్ ఉత్పత్తులు తక్కువ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంటుంది. సబ్బులు, డిటర్జెంట్లు, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటికి ఈ బ్రాండ్ కొని డబ్బు ఆదా చేయవచ్చు.

6) ఆఫర్ సెక్షన్ పరిశీలించండి.. 
కొన్ని ప్రత్యేక విభాగాల్లో గడువు తేదీ దగ్గర ఉన్న లేదా డిస్కౌంట్లు ఉన్న వస్తువులు ఉంటాయి. త్వరగా ఉపయోగించే వస్తువులను ఇక్కడ కొనవచ్చు. అయితే కొనేముందు ఎక్స్‌పైరీ డేట్ తప్పక తనిఖీ చేయాలి.

7) మొత్తం స్టోర్ పరిశీలించండి..
కేవలం కొన్ని విభాగాలోనే కాకుండా స్టోర్‌లోని ప్రతీ విభాగంలోనూ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం స్టోర్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది.



 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source