• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Dussehra Special Trains 2026: దసరా ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్లు!

Dussehra Special Trains 2026: దసరా ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్లు!

Dussehra Special Trains 2026: దసరా, దీపావళి పండుగలు దగ్గర పడుతున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో రైళ్లు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా 100 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

Written ByVishnu Priya
Published: Sep 21, 2026, 08:08 PM IST|Updated: Sep 21, 2026, 08:11 PM IST
joinshare
Dussehra Special Trains 2026:  దసరా ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్లు!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dussehra Special Trains 2026:  దసరా, దీపావళి పండుగలు కోసం.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను కలుపుతాయి. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు కూడా రైల్వే శాఖ వెల్లడించింది. చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్ వెళ్లే ప్రత్యేక రైలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్, తిరుచిరాపల్లి మీదుగా నాగర్‌కోయిల్ చేరుకుంటుంది.

అలాగే చర్లపల్లి-శ్రీకాకుళం ప్రత్యేక రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-చర్లపల్లి రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు నడుస్తుంది. ఈ సర్వీసులు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఆగుతాయి.

ఇక ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి ప్రత్యేక రైలు కూడా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలు రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో ఆగుతుంది.

పండుగ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. అయితే రైలు తేదీలు, సమయాలు, టికెట్ లభ్యతను అధికారిక రైల్వే సమాచారం ద్వారా ముందుగా చెక్ చేసుకుని బుకింగ్ చేసుకోవడం మంచిది.
 

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఫెడ్ కీలక నిర్ణయం.. తగ్గిన బంగారం ధర.. నేడు సెప్టెంబర్ 19వ తేదీ ధరలివే..!!

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source