• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Financial Plan Layoff: ఐటీ ఉద్యోగులకు బిగ్ వార్నింగ్.. మీ జాబ్ పోయినా రోడ్డుపై పడకముందే ఈ ప్లాన్ చేయండి!

Financial Plan Layoff: ఐటీ ఉద్యోగులకు బిగ్ వార్నింగ్.. మీ జాబ్ పోయినా రోడ్డుపై పడకముందే ఈ ప్లాన్ చేయండి!

Financial Plan After A Layoff: ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం.. కంపెనీల వ్యయ నియంత్రణ చర్యల వల్ల ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. కెరీర్ ఆరంభంలోనే భారీ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పియర్ ప్రెజర్, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఈఎంఐలు, అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అనుకోకుండా సడన్ పింక్ స్లిప్స్ వచ్చినా లేదా ఉద్యోగం పోయినా తట్టుకునేలా ప్రతి నెలా ఆదాయంలో కనీసం 10% నుండి 15% వరకు ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ కార్పస్ కోసం మొదటి నెల నుంచే కేటాయించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Written ByHarish Darla
Published: Oct 08, 2026, 05:31 AM IST|Updated: Oct 08, 2026, 05:32 AM IST
joinshare
Financial Plan Layoff: ఐటీ ఉద్యోగులకు బిగ్ వార్నింగ్.. మీ జాబ్ పోయినా రోడ్డుపై పడకముందే ఈ ప్లాన్ చేయండి!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

2

విశ్వంభర రిలీజ్ డేట్ అంతు చిక్కని మెగా సస్పెన్స్.. ? సినిమాకు మోక్షం ఎపుడో..!!

3

SBI Research Repo Rate: డిసెంబరులో మరో అరువుదెబ్బ..50 బేసిస్ పాయింట్లు పెరగనున్న ఆర్బీఐ రెపోరేటు?

4

స్టేట్మెంట్స్ తో సంచలనం.. రిలీజుల్లో గందరగోళం.. ఈ నిర్మాత స్టైలే వేరు..

5

Financial Plan Layoff: ఐటీ ఉద్యోగులకు బిగ్ వార్నింగ్.. మీ జాబ్ పోయినా రోడ్డుపై పడకముందే ఈ ప్లాన్ చేయండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Financial Plan After A Layoff: గతంలోని 90ల కాలంలో 60 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సు వరకు ఒకే ఉద్యోగం స్థిరంగా సాగేది. కానీ నేటి వేగవంతమైన ఐటీ యుగంలో 23 - 24 ఏళ్లకే ఉద్యోగాల్లో చేరి కొద్ది కాలంలోనే ఆరంకెల వేతనాలు సాధిస్తున్నారు. అయితే సరైన ఆర్థిక అవగాహన లేకపోవడం, సమాజంలో తోటివారి ఒత్తిడి కారణంగా, ఉద్యోగం రాగానే ఈఎంఐలపై విలువైన గాడ్జెట్లు, బైక్‌లు, కార్లు, హోమ్ లోన్లు, ప్లాట్ల లోన్లు తీసుకుంటున్నారు. 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఈ విడతల రుణాల వాయిదాలతో పాటు పిల్లల చదువుల ఖర్చులు మొదలై తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.

మరోవైపు, కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక వేతనాలు, ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులను లేఆఫ్‌ల ద్వారా తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇటీవల ఐఐటీలు, ఐఐఎంలలో ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వని దాదాపు 2,000 కంపెనీలను సదరు విద్యాసంస్థలు బ్లాక్‌లిస్ట్ చేయడమే ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2021లో డ్యూయల్ జాబ్స్ లేదా మూన్‌లైటింగ్ చేసిన నిపుణులు సైతం, నేడు పింక్ స్లిప్స్, ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తున్నారు.

కొందరు నెలకు రూ. 3 లక్షల అధిక జీతం తీసుకుంటున్నప్పటికీ, రూ. 50 లక్షల ప్లాట్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ల వల్ల నెలకు రూ. 20,000 ఎస్ఐపీ (SIP) కూడా చేయలేని సంక్లిష్ట స్థితిలో చిక్కుకుంటున్నారు. ఆస్తులపై వచ్చే అద్దె కంటే కట్టే ఈఎంఐ వాయిదాలే ఎక్కువగా ఉండటంతో నెల చివరికి చేతిలో ఏమీ మిగలట్లేదు. ఉద్యోగం పోయినా లేదా ఆదాయం తగ్గినా తట్టుకోవడానికి తగినంత ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడమే ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణంగా మారుతోంది.

ఆర్థిక భద్రతను సాధించడానికి ఆర్థిక నిపుణులు కొన్ని కీలక సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు.

1) మొదటి నుంచే పొదుపు: సంపాదించే ప్రతి రూపాయిలో కనీసం 10% నుండి 15% వరకు తొలి నెల నుంచే పక్కన పెట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా సురక్షిత మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి.

2) ఈఎంఐల నియంత్రణ: అప్పులు చేసి ఆస్తులు పెంచుకోవడం కంటే దీర్ఘకాలిక రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన కార్పస్ నిర్మించుకుంటే అందులో నుండి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

3) ఎమర్జెన్సీ ఫండ్: అనుకోని సంక్షోభాలు లేదా జాబ్ లాస్ వచ్చినా తట్టుకునేలా తగినంత అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోవాలి.

కేవలం అధికంగా సంపాదించడం మాత్రమే సంపద కాదు. సంపాదించిన దానిలో కొంత భాగం ఆదా చేసి పక్కన పెట్టినప్పుడే నిజమైన ఆర్థిక భద్రత లభిస్తుంది. ముందుచూపుతో చేసే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రమే ఐటీ ఉద్యోగులకు సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News