• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Flipkart బిగ్ బిలియన్ డేస్‌లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25, S25 FE ధరలు ఎంతంటే?

Flipkart బిగ్ బిలియన్ డేస్‌లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25, S25 FE ధరలు ఎంతంటే?

Samsung Galaxy S25 Flipkart Deal: ఎట్టకేలకు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ సేల్ డేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించిన మోడల్స్ పై ధరలను తగ్గిస్తూ.. ఆఫర్స్ ను కూడా ప్రకటిస్తూ వస్తోంది.. ఇందులో భాగంగా ఇటీవలే సాంసంగ్ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మోడల్స్ పై ఆఫర్స్ ను టీజ్ చేసింది.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 03:48 PM IST|Updated: Sep 19, 2026, 03:50 PM IST
joinshare
Flipkart బిగ్ బిలియన్ డేస్‌లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25, S25 FE ధరలు ఎంతంటే?
Image Credit: Flipkart బిగ్ బిలియన్ డేస్‌లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25, S25 FE ధరలు ఎంతంటే?

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Samsung Galaxy S25 Flipkart Deal: ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునే మొబైల్ ప్రియులకు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందించింది. త్వరలో మొదలు కాబోతున్న బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ఉండే ఆఫర్స్‌ను ప్రకటించకనే ప్రకటించింది.. ముఖ్యంగా సాంసంగ్ బ్రాండ్‌కి సంబంధించిన ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై అంచనాలకు మించిన తగ్గింపు అందిస్తున్నట్లు ప్రకటించేసింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సాంసంగ్ గెలాక్సీ s25, గాలక్సీ s25 ఎఫ్ఈ మోడల్స్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే ఫ్లిప్కార్ట్ తన మైక్రో వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఈ మొబైల్ పై ఉండే ఆఫర్స్ ఏంటో? ఇవి ఏయే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సేల్ ఎప్పుడు మొదలవుతుంది.?
ఈ మెగా సేల్ అక్టోబర్ 9వ తేదీ నుంచి సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది.. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌తో పాటు బ్లాక్ మెంబర్షిప్ కలిగిన కస్టమర్లకు ముందుగానే ఈ సేల్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించింది. అంటే అక్టోబర్ 8వ తేదీ నుంచే ఈ డీల్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ ఈ మెగా సేల్ కు సంబంధించిన మైక్రో సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ మోడల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉండబోతున్నట్లు కూడా పేర్కొంది.

ఆఫర్ ధరలు..
Galaxy S25 FE:
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మెగాసేల్‌కు సంబంధించిన మైక్రో సైట్ లో ధరను రూ.4X,XXXగా టీజ్ చేశారు. అంటే బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్చేంజ్ బోనస్తులతో కలిపి ఈ మోడల్ రూ.50 వేల కంటే తక్కువ ధరకే లభించే అవకాశాలున్నాయి. ఇక samsung galaxy s25 ఆఫర్స్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మైక్రో సైక్లో దీని ధర రూ.5X,XXXగా కంపెనీ టీజ్ చేసింది. దీని ధర వినియోగదారులకు రూ.60 వేళలోపే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..
Samsung Galaxy S25:
ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ చూస్తే.. దీనిని కంపెనీ 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. ఇక ఇది వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన 50 ఎంపీ ప్రధాన కెమెరా తో పాటు 12 ఎంపీ అల్ట్రా-వైడ్, 10 ఎంపీ టెలిఫోటో లెన్స్. సెల్ఫీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండడం విశేషం. ఇది ఎంతో శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Samsung Galaxy S25 FE స్మార్ట్ ఫోన్ వివరాల్లోకి వెళితే..  ఇందులో కంపెనీ 6.7 అంగుళాల పెద్ద డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎంతో అద్భుతమైన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ తో పాటు 8 ఎంపీ టెలిఫోటో సెన్సార్లతో కూడిన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 4,900mAh బ్యాటరీ, వేగవంతమైన 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News