• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

Fuel Vs EV Insurance Comparison: దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈవీలను సొంతం చేసుకునే క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను, వాటి మధ్య వ్యత్యాసాలను సమగ్రంగా అర్థం చేసుకోవడం ఎంతో కీలకం. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఇన్సూరెన్స్‌లో బ్యాటరీ రక్షణ, ఆమోదిత ప్రత్యేక గ్యారేజీల అందుబాటు, ఛార్జింగ్ పరికరాల కవరేజ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలలో పెద్దగా తేడాలే ఉంటాయి.

Written ByHarish Darla
Published: Oct 04, 2026, 01:40 PM IST|Updated: Oct 04, 2026, 01:44 PM IST
joinshare
Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Kavitha: కరువు మండలాలను వెంటనే ప్రకటించండి.. సీఎం రేవంత్‌పై కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha: కరువు మండలాలను వెంటనే ప్రకటించండి.. సీఎం రేవంత్‌పై కవిత సెన్సెషనల్ కామెంట్స్..

2

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!

3

మీ ఖాతాలో రూ.2000 పడలేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!

4

Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

5

Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Fuel Vs EV Insurance Comparison: పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లు ఇంధన వ్యయాన్ని తగ్గించినప్పటికీ, బీమా ఎంపిక విషయంలో కొన్ని కీలక వ్యత్యాసాలను వాహనాదారులు గమనించాలి. భారతీయ రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, స్వంత వాహన రక్షణ కోసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం పెట్రోల్, ఈవీ వాహనాలు రెండింటికీ సమానంగా వర్తిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల బీమా నిబంధనలు కొన్ని మారుతుంటాయి.

1) బ్యాటరీ ప్రాముఖ్యత, కవరేజ్..
ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ ప్యాక్ అత్యంత కీలకమైన భాగం కావడమే కాకుండా మొత్తం వాహనం విలువలో అత్యధిక వాటాను బ్యాటరీనే కలిగి ఉంటుంది. ప్రమాదాల వల్ల హై-వోల్టేజ్ బ్యాటరీ లేదా మోటార్ దెబ్బతింటే వాటి రిపేరు లేదా కొత్త పరికరాన్ని మార్పు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. 
 

ఎలక్ట్రిక్ కారు రోడ్డు ప్రమాదానికి గురైయ్యి.. బ్యాటరీకి నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం లభించవచ్చు. అయితే కాలక్రమేణా బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యం తగ్గడం లేదా సాధారణ క్షీణత బీమా కవరేజ్ పరిధిలోకి రాకపోవడం గమనార్హం. ఇవి వాహన తయారీదారు అందించే వారంటీ కిందకే వస్తాయి. దీంతో ఎలక్ట్రిక్ కారుకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో బ్యాటరీ మినహాయింపులను స్పష్టంగా పరిశీలించి, అడిగి తెలుసుకోవాలి.

2) ప్రత్యేక గ్యారేజ్ నెట్‌వర్క్, ఛార్జింగ్ పరికరాలు 
సాధారణ పెట్రోల్ కార్ల మరమ్మతులను స్థానిక గ్యారేజీలలో చేయించుకోవడం ఎంతో సులభం. కానీ ఈవీలలోని సంక్లిష్ట హై-వోల్టేజ్ వ్యవస్థలను బాగుచేయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన మెకానిక్‌లు, టెక్నీషియన్లు, ఆధునిక పనిముట్లు అవసరం. 

ఈ కారణంతో మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 'ఈవీ ఆమోదిత క్యాష్‌లెస్ గ్యారేజీలు' మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అలాగే హోమ్ ఛార్జర్లు, పోర్టబుల్ కేబుల్స్ దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా నష్టం జరగకుండా అదనపు రుసుము చెల్లించి 'యాడ్-ఆన్ కవర్' తీసుకోవడం ప్రయోజనకరంగా మారుతుంది.

3) ప్రీమియం ధరలు, సరైన పాలసీ నిర్ణయం..
పెట్రోల్ కారు మోడల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు మార్కెట్ ధర, స్పేర్ పార్ట్స్ ఖర్చు భారీగా ఉంటుంది. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా సహజంగానే పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కేవలం తక్కువ ప్రీమియం లభిస్తుందనే ఆశతో చౌకైన పాలసీని తీసుకోకపోవడమే ఉత్తమం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయాలలో అయ్యే సొంత ఖర్చులు, బ్యాటరీ రక్షణ సదుపాయాలు, గ్యారేజ్ నెట్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని సరైన పాలసీని ఎంచుకోవడమే శ్రేయస్కరం.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News