• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Gold Loan: మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా..? తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి..!

Gold Loan: మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా..? తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి..!

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే కీలక తీర్పును హిమాచల్ ప్రదేశ్‌లోని వినియోగదారుల కమిషన్ వెలువరించింది. బంగారాన్ని తామే స్వయంగా పరీక్షించి రుణం మంజూరు చేసిన అనంతరం.. ఆ నగలు నకిలీవంటూ ఖాతాదారుడిపై భారం మోపిన ఓ బ్యాంక్‌కు జిల్లా వినియోగదారుల గట్టి షాక్ ఇచ్చింది. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 03, 2026, 04:15 PM IST|Updated: Oct 03, 2026, 04:17 PM IST
joinshare
Gold Loan: మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా..? తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి..!
Image Credit: Gold Loan (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

2

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

3

Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!

4

శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!

5

Shoaib Malik Vaneeza Sattar: నాలుగో పెళ్లికి రెడీ అయిన సానిమా మీర్జా మాజీ భర్త..44 ఏళ్ల వయసులో 31 ఏళ్ల హీరోయిన్‌తో షోయబ్ మాలిక్ లగ్గం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Loan: ఓ వ్యక్తి గోల్డ్ లోన్ కోసం బ్యాంక్‌కు వెళ్లాడు. బంగారం స్వచ్ఛతను చెక్ చేసిన బ్యాంక్ అధికారులు.. లోన్ కూడా మంజూరు చేశారు. అయితే బ్యాంక్ ఇంటర్నల్ చెకింగ్‌లో నకిలీ బంగారం అంటూ కస్టమర్‌కు ఫోన్ చేసి షాకిచ్చారు. తీసుకున్న లోన్, వడ్డీని వెంటనే చెల్లించాలని నోటీసులు పంపించారు. దీంతో బ్యాంక్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ముందు బంగారం అంతా బాగుందని.. తరువాత తన అనుమతి లేకుండా బంగారాన్ని పరీక్షించి నకిలీదని ఎలా తెలుస్తారని నిలదీశాడు. వ్యవహారం వినియోగదారులు కమిషన్‌కు చేరింది. ఇరు పక్షాల వాదనాలు విన్న కమిషన్.. కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా కస్టమర్‌కు రూ.14.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..

షిమ్లాకు చెందిన ఓ వ్యక్తి తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 2022లో రూ.3.98 లక్షలు, మార్చి 2023లో మరో రూ.3.98 లక్షలు, ఏప్రిల్ 2023లో ఇంకో రూ.6.42 లక్షల లోన్ తీసుకున్నాడు. ప్రతిసారి బ్యాంక్ అధికార్లు ఆభరణాల బరువు, నాణ్యతను క్షుణ్ణంగా చెక్ చేసిన తరువాతే లోన్ ఇచ్చారు. అయితే జూలై 2023లో బ్యాంక్ అంతర్గత తనిఖీల పేరిట ఆభరణాలను మళ్లీ పరిశీలించి.. తాకట్టు పెట్టిన బంగారం పూర్తిగా నకిలీదని అధికారులు తేల్చారు. లోన్ తీసుకున్న రూ.10.95 లక్షల అసలుతో పాటు వడ్డీ, ఇతర ఛార్జీలను వెంటనే చెల్లించాలంటూ కస్టమర్‌కు నోటీసులు పంపించారు.

బ్యాంక్ నోటీసులను వ్యతిరేకించిన కస్టమర్.. తన సమక్షంలో కాకుండా.. తన పర్మిషన్ లేకుండానే మళ్లీ నాణ్యతా పరీక్షలు నిర్వహించారని ఆరోపించాడు. బ్యాంక్ ఆధీనంలో ఉన్న సమయంలో ఆభరణాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని ఆరోపించాడు. స్వతంత్ర సంస్థతో పరీక్షించి తన అసలు నగలు తిరిగిస్తే బకాయిలు చెల్లిస్తానని చెబుతూ న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. మరోవైపు బ్యాంక్‌ వాదిస్తూ.. తమ అంతర్గత ఆడిట్‌లో బంగారం నకిలీ అనే విషయం బయటపడిందని.. గతంలో నాణ్యతను ధ్రువీకరించిన పాత వాల్యుయేటర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపింది.

ఈ వివాదంపై విచారణ చేపట్టిన షిమ్లా జిల్లా వినియోగదారుల కమిషన్ బ్యాంక్ వాదనలను తోసిపుచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లోన్ తీసుకున్న వ్యక్తి పర్మిషన్‌ లేదా ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం చెల్లదని స్పష్టం చేసింది. గతంలో తామే స్వయంగా పరీక్షించి అంగీకరించిన తర్వాత తదనంతర లోపాలకు కస్టమర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పింది. బ్యాంకుదే తప్పని నిర్ధారించిన కమిషన్.. తాకట్టు పెట్టిన 103 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.14 లక్షలు, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.30 వేలు, పిటిషన్ ఖర్చుల కింద రూ.20 వేలు కలిపి మొత్తం రూ.14.5 లక్షలను బాధితుడికి చెల్లించాలని సదరు బ్యాంక్‌ను ఆదేశించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News