SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పతనం దిశగానే పసిడి ధర.. నేడు సెప్టెంబర్ 26వ తేదీ శనివారం ధరలివే..!!

Gold Rate Today: గత కొన్నిరోజులుగా పతనం దిశగా కొనసాగుతున్న బంగారం ధరలు..నేడు శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో ధరలు పెరిగినట్లు మనం గమనించవచ్చు. హైదరాబాద్ నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written By Bhoomi
Published: Sep 26, 2026, 08:47 AM IST | Updated: Sep 26, 2026, 08:48 AM IST
Image Credit: Gold Rate Today
Join

Gold Rate Today: నేడు సెప్టెంబర్ 26వ తేదీ శనివారం బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,220 పలుకుతోంది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,100వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 2,35,700 వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా పెరిగినట్లు మనం గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక ఔన్సు బంగారం ధర $4,300గా ఉంది. అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ బలపడటమేనని భావిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా యూఎస్ డాలర్ విలువ గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా డాలర్ విలువ పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా, పెట్టుబడిదారులు బంగారంపై లాభాలను స్వీకరించడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటమే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పాలి. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచింది. అక్టోబర్‌లో కూడా రేట్లు పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు కూడా పెరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుండి బాండ్లకు మళ్లించవచ్చు. బంగారం ఎలాంటి వడ్డీని చెల్లించదు. అందువల్ల, వడ్డీ రేట్లు, బాండ్ రాబడులు పెరిగినప్పుడు, బంగారం ఆకర్షణ కొంతవరకు తగ్గుతుంది. ప్రముఖ కమోడిటీ పరిశోధన విశ్లేషకుడు ఆశిష్ రాజోడియా ప్రకారం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు డాలర్‌ను కూడా బలపరుస్తున్నాయి. డాలర్ బలపడటం వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరిగి ధరలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.  

మరోవైపు, ముడి చమురు బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది డాలర్‌కు డిమాండ్‌ను పెంచుతుంది. ఫలితంగా, డాలర్ బలపడితే, స్వల్పకాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఖరీదైన ముడి చమురు ద్రవ్యోల్బణాన్ని కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తరచుగా రక్షణ కోసం బంగారం వైపు మొగ్గు చూపుతారు. అప్పుడు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.   

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES