SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రికార్డు స్థాయిలో పతనమవుతున్న బంగారం ధరలు.. నేడు సెప్టెంబర్ 30వ తేదీ ధరలు ఇవే..!!

Gold Rate Today: దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్ పై రాబడులు పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 30, 2026, 08:28 AM IST | Updated: Sep 30, 2026, 08:30 AM IST
Image Credit: Gold Rate Today
Join

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్త. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా భారీగా దిగివస్తున్నాయి. రెండు రోజుల్లో పసిడి ధర రూ. 3,880పైగా పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తోడుగా అమెరికా డాలర్ పడటంతోపాటు అమెరికా బాండ్స్ పై రాబడులు పెరుగుతుండటం వల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతుండటం మనం గమనించవచ్చు.  కాగా నేడు సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,48,790పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,36,390 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,590 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 2,39,990గా ట్రేడ్ అవుతోంది.

కమోడిటీ ఫండమెంటల్ అనలిస్ట్ పింకీ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..  సెప్టెంబర్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ప్రపంచ ఒత్తిడి కారణంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 1.50 లక్షల కంటే దిగువకు పడిపోయింది. అయితే, అంతర్జాతీయ బంగారం ధరలు స్వల్పంగా మెరుగుపడ్డాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 4శాతం పడిపోయిన తర్వాత, స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $30.34 తగ్గి $4,145.26కు చేరాయి. గత సెషన్‌లో దాదాపు 6శాతం పడిపోయిన వెండి కూడా కోలుకుని, ఔన్సుకు సుమారు $60.69 వద్ద ట్రేడ్ అవుతోంది.

లెహ్‌మన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ ప్రకారం, బంగారం ఔన్సుకు సుమారు $4,140 వద్ద, వెండి ఔన్సుకు సుమారు $60.5 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికాలో దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయనే అంచనాల కారణంగా బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచుతోంది.

మరోవైపు, ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. మీర్ అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ ప్రకారం, పరస్పర విరుద్ధమైన నివేదికల మధ్య ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అణు సమస్యకు సంబంధించి ఇరాన్ ఆంక్షలను సడలిస్తోందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అధికారిక స్పందనను ఈ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES