SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

షాక్ నుంచి భారీ రిలీఫ్.. మళ్లీ రూ.1.5 లక్షల దిగువకు బంగారం.. తగ్గుదల ఎంతంటే?

Gold Rate Today: పోయిన వారం దేశంలో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. వారం ప్రారంభంలోని ధరతో పోల్చినట్లయితే.. కేవలం రూ. 350 మేర కోత పడింది. నేడు అక్టోబర్ 4వ తేదీ సోమవారం దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 04, 2026, 08:04 AM IST | Updated: Oct 04, 2026, 08:05 AM IST
Image Credit: Gold Rate Today
Join

Gold Rate Today: గతవారం దేశీయంగా బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలోని ధరలతో పోల్చినట్లయితే.. మేలిమి బంగారం ధరలో కేవలం రూ. 350మేర తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు అమెరికా ట్రెజరీ బాండ్స్ పై రాబడులు పెరగడంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే నేడు అక్టోబర్ 4వ తేదీ సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,49,180గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,36,750గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత వారాన్ని పరిశీలిస్తే, బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. సర్వకాలిక రికార్డులతో పోల్చి చూస్తే, బంగారం ధరలు సుమారు రూ. 36,000 మేర తగ్గినట్లు మనం చూడవచ్చు. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు రూ. 1.83 లక్షలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. అయితే, బంగారం ధరలపై డాలర్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం డాలర్ బలపడింది. అందుకే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ పెరిగినప్పుడు, బంగారం ధరలు తగ్గుతాయి. అదనంగా, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు గణనీయంగా పెరిగాయి. బంగారం ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా పరిగణించవచ్చు.

బంగారం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25శాతం పెంచాలని తీసుకున్న నిర్ణయం. దీని కారణంగా, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు కూడా పెరిగాయి. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారంపై తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని యూఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇది మరోసారి బంగారం ధరల తగ్గుదలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను తగ్గించాయి. ఇది బంగారం డిమాండ్‌పై కూడా ప్రభావం చూపవచ్చు. అందువల్ల, బంగారం పెట్టుబడిదారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. అంతేకాకుండా, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES