మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు (నవంబర్ 17, మంగళవారం) దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం రేటు ఏకంగా ఏడాది కనిష్ఠ స్థాయికి దిగిరావడం విశేషం.
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు (నవంబర్ 17, మంగళవారం) దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం రేటు ఏకంగా ఏడాది కనిష్ఠ స్థాయికి దిగిరావడం విశేషం. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు కూడా బంగారం ధరలు పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.760 తగ్గి రూ.1,36,040కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.700 పడిపోయి రూ.1,24,700 పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ఈ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలకు 3శాతం జీఎస్టీ అదనంగా ఉంటుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.
ముఖ్యం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరను పరిశీలిస్తే.. సోమవారం నాడు స్పాట్ బంగారం ధరలు 0.7శాతం తగ్గి ఔన్సుకు $3,852.95 వద్దకు చేరాయి. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో బంగారం ధరలు $3,830కి పడిపోయాయి. అక్టోబర్ 2025 తర్వాత ఇదే అత్యల్ప స్థాయిగా నమోదవుతోంది. అంటే, బంగారం ధరలు ఏడాది కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయని అర్థం.
యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు కూడా తగ్గాయి. డిసెంబర్ డెలివరీ కాంట్రాక్టులు సుమారు 0.9శాతం తగ్గి ఔన్సుకు $3,853 వద్ద స్థిరపడ్డాయి. యూఎస్‌లో ద్రవ్యోల్బణం ఇంకా అధికంగా ఉండటంతో, ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు పెరిగాయి. దీనివల్ల బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువ పెరిగి, బంగారంపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా, డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ఇదే విధమైన ప్రభావం కనిపిస్తోంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుండి యూఎస్ ట్రెజరీ బాండ్ల వైపు మళ్లించవచ్చు. అందుకే బంగారం ధరలు తగ్గుతున్నాయి.
యూఎస్ డాలర్ ఏప్రిల్ 2025 తర్వాత అత్యంత బలమైన స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతోంది. దీని ఫలితంగా బంగారం ధరలు కూడా వేగంగా పడిపోతున్నాయి. అంతేకాకుండా, డిసెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 95 శాతం సంభావ్యతతో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని CME ఫెడ్‌వాచ్ అంచనా వేసింది. 50 బేసిస్ పాయింట్ల పెంపునకు 5 శాతం అవకాశం ఉందని కూడా అది పేర్కొంది.
వడ్డీ రేట్లు పెరిగితే, వడ్డీ ఆదాయాన్ని ఇవ్వని బంగారం వంటి పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం ధరలకు ప్రతికూలంగా మారుతున్నాయి. అక్టోబర్ 27, 28 తేదీలలో జరిగిన ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం విడుదల కానున్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ తదుపరి నిర్ణయాల గురించి సంకేతాల కోసం మార్కెట్లు వీటిపై దృష్టి సారిస్తున్నాయి.
18 క్యారెట్ల బంగారం ధర లక్ష:
తగ్గుతున్న బంగారం ధరలు ప్రస్తుతం భౌతిక బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. బంగారు ఆభరణాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, 18 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు పడిపోవడం బంగారం ప్రియులకు ఊటరనిచ్చిందని చెప్పాలి.