SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ 27 నుంచి కీలక భేటీ.. దీపావళి వేళ పసిడి ప్రియులకు పండగే పండుగ..!!

Gold Rate: పసిడి ప్రియులకు దీపావళి పండగ గుడ్ న్యూస్ చెప్పనుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఫెడ్ రిజర్వ్ భేటీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా పతనం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Bhoomi
Published: Oct 22, 2026, 11:27 AM IST | Updated: Oct 22, 2026, 11:29 AM IST
Image Credit: Gold Rate:
Join

Gold Rate: దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పసిడి ప్రియుల్లో ఒకటే సందేహం నెలకొంది. ఈసారైనా బంగారం ధరలు తగ్గుతాయా లేక మళ్లీ భగ్గుమంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు వారాలుగా దేశీయంగా మరియు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం చూస్తుంటే రాబోయే రోజుల్లోనూ పసిడి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందన్న బలమైన అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీ కానుండటమే. అక్టోబర్ 27, 28 తేదీలలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఒకవేళ ఫెడ్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లను పెంచే నిర్ణయం తీసుకుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు భారీగా పడిపోయే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికాలో వడ్డీ రేట్లపై అక్టోబర్ 28వ తేదీన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం చూస్తే, అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనుంది. ఈ నిర్ణయమే భవిష్యత్తులో బంగారం ధరల గమనాన్ని నిర్దేశించనుంది. ఫెడ్ భేటీ ఫలితాల ఆధారంగానే దీపావళి నాటికి పసిడి ధరలు తగ్గుతాయా లేదా అనే స్పష్టత రానుంది.
సెప్టెంబర్ నుండి బంగారం ధరలు భారీగా పడిపోయాయి:

ఈసారి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని చాలా మంది వ్యాపారులు ఇప్పటికీ ఆశిస్తున్నారు. ముఖ్యంగా.. సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండవచ్చని నివేదికలు వస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచితే.. యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు కూడా పెరుగుతాయి. ఆ సమయంలో ఆకర్షణీయమైన ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో..పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల నుండి యూఎస్ ట్రెజరీ బాండ్ల వైపు మళ్లవచ్చని నివేదికలు వస్తున్నాయి. ఇలా జరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గి, బంగారం ధరలు పడిపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

బంగారం ధరలు 4,100డాలర్ల కంటే దిగువకు పడిపోయే ఛాన్స్: 
ప్రస్తుతం.. ఒక ఔన్సు బంగారం ధర  4,140డాలర్లుగా ఉంది. బంగారం ధర ఈ స్థాయి నుండి 4,100డాలర్లకు పడిపోతే.. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తీవ్రంగా పడిపోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం.. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ. 1.46 లక్షలుగా ఉంది. గత నెలలో బంగారం ధర సుమారుగా 5శాతం తగ్గినట్లు గమనించవచ్చు. అయితే.. నవంబర్ 8న దీపావళి పండుగ ఉన్నందున.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, దీపావళి సమయంలో బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. నగల దుకాణాలకు కొత్త వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES