Donald trump comments on Pulitzer prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎనిమిది యుద్దాలు ఆపినతనను కాదని ఇతరుల్ని ఎంపిక చేయడం నార్వే దేశానికి సిగ్గుచేటని మండిపడ్డారు. పలు దేశాలు సైతం తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన తనను పరిగణలోకి తీసుకొక పొవడం దారుణమన్నారు.
అయితే.. ఇటీవల నోబెల్ కమిటీ అనూహ్యంగా ట్రంప్ కు మరోసారి షాక్ ఇచ్చింది. నోబెల్ శాంతి ప్రకటన తర్వాత కూడా ట్రంప్ ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అయితే తాజాగా.. ఆయన కన్ను కాస్త పులిట్జర్ పురస్కారంపై పడింది. నేను రాసిన రచనలకు పులిట్జర్ అయిన ఇవ్వాల్సిందేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రాజుకుంది.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌత్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెండిల్టన్‌లోని టీ.ఈడీ గారిసన్ అరేనాలోని సభలో మాట్లాడుతూ.. పులిట్జర్ పురస్కారంపై ట్రంప్ మాట్లాడారు. ఎనిమిదియుద్దాలు ఆపిన తనకు నోబెల్ రాలేదని పదే పదే పలు వేదికలపై మాట్లాడిన ట్రంప్ ఈసారి తానురాసిన రచనలకైన పులిట్జర్ పురస్కారం ఇవ్వాల్సిందే నంటూ చెప్పుకొచ్చారు.
రష్యా దర్యాప్తుపై కథనాలకు గాను పులిట్జర్ అవార్డులు పొందిన జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని ట్రంప్ ఏకీపారేశారు. అసలు వారికి ఆ పురస్కారం అందుకునే అర్హత లేదని డొనాల్డ్ ట్రంప్ వెటకారంగా మాట్లాడారు. తాను ఎన్నో రచనలు చేశానని కనీసం పులిట్జర్ అయిన రావాల్సిందని ట్రంప్ తన మనసులో ఉన్న మరో కోరికను బైటపెట్టారు. ప్రస్తుతం ట్రంప్ పులిట్జర్ పురస్కారంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు డొనాల్డ్ ట్రంప్ ను ఇక నోబెల్ శాంతి బహుమతి అయ్యింది.. ఇక పులిట్జర్ పురస్కారం ఇవ్వాలా..?.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక ట్రంప్ తన టెంపరీ తనం నిర్ణయాలతో ప్రపంచదేశాల్ని ముప్పుతిప్పులు పెడుతున్న విషయం తెలిసిందే. తాను చెప్పిన విధంగా నడుచుకోకుంటే ట్రంప్ టారిఫ్ సుంకాల అస్త్రాలను సంధిస్తున్నారు. యుద్దాలపై ఆయన తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.