• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Jio Bharat 4G Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..6 నెలల పాటు రీఛార్జ్ పూర్తిగా ఉచితం..ఎలా?

Jio Bharat 4G Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..6 నెలల పాటు రీఛార్జ్ పూర్తిగా ఉచితం..ఎలా?

Jio Bharat 4G Recharge Offer: దేశంలో 2G నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులను 4G వైపు ప్రోత్సహించే దిశగా రిలయన్స్ జియో ఒక ప్రత్యేక ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ తన 10వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని 'జియోభారత్' 4G ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ సదుపాయాన్ని అందించనుంది. ఈ ఫోన్ ప్రారంభ విక్రయ ధర రూ. 1,499 కాగా, అందులో లభించే ఆరు నెలల ఉచిత రీఛార్జ్ విలువను తీసివేస్తే ఫోన్ వాస్తవ ధర కేవలం రూ. 299 మాత్రమే అవుతుందని జియో వెల్లడించింది.

Written ByHarish Darla
Published: Oct 01, 2026, 19:20 IST|Updated: Oct 01, 2026, 19:23 IST
joinshare
Jio Bharat 4G Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..6 నెలల పాటు రీఛార్జ్ పూర్తిగా ఉచితం..ఎలా?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jio Bharat 4G Recharge Offer: భారతదేశాన్ని 2G రహితంగా మార్చడమే ప్రధాన ధ్యేయంగా దాదాపు ఐదేళ్ల క్రితం నిర్వహించిన తమ వార్షిక సమావేశంలో రిలయన్స్ గ్రూప్ ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని ప్రకటించింది. దేశంలోని పాత 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులందరి చేతుల్లోకి వేగవంతమైన 4G సేవలను తీసుకురావడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ఆ హామీని నెరవేరుస్తూ, జియో తన 10వ వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా పాత 2G వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'జియోభారత్' 4G ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ధర, ఉచిత రీఛార్జ్ వివరాలు..
ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా జియోభారత్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ప్రారంభంలో మొత్తం ధర అయిన రూ. 1,499 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు చేసిన కస్టమర్లకు తదుపరి ఆరు నెలల పాటు ఉచిత రీఛార్జ్ లభిస్తుంది. 

ఈ ఆరు నెలల కాలంలో వినియోగదారులకు ప్రతి నెలా 14 GB డేటాతో పాటు అపరిమిత HD వాయిస్ కాలింగ్ సదుపాయాలు అందుతాయి. దీనివల్ల రాబోయే ఆరు నెలల పాటు రీఛార్జ్ ఖర్చుల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా 2G ఫీచర్ ఫోన్‌లు వాడే వినియోగదారులు రీఛార్జ్ కోసం నెలకు సుమారు రూ. 199 వరకు ఖర్చు చేస్తుంటారు. ఆ లెక్కన 6 నెలల కాలంలో ఈ రీఛార్జ్ ఖర్చు దాదాపు రూ. 1,200 అవుతుంది. ఫోన్ మొత్తం ధర రూ. 1,499 నుండి ఈ రూ. 1,200 రీఛార్జ్ విలువను తీసివేస్తే, 2G నుంచి 4Gకి మారడానికి కస్టమర్‌‌కు అయ్యే వాస్తవ అదనపు ఖర్చు కేవలం రూ. 299 మాత్రమేనని జియో తెలిపింది. ఇంత తక్కువ ధరకు 4G ఫోన్‌ను అందించడం టెలికాం మార్కెట్‌లో తీవ్రమైన పోటీని సృష్టించనుంది.

సాంకేతిక వివరాలు, సేవలు..
2G నుండి 4Gకి అప్‌గ్రేడ్ అయ్యే వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుందని టెలికాం సంస్థ జియో ప్రకటించింది. జియోభారత్ ఫోన్ 2.4-అంగుళాల డిస్‌ప్లే, 2000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ద్వారా JioTV యాప్‌లో 500కి పైగా టీవీ ఛానెళ్లను ఉచితంగా చూడవచ్చు. 

అలాగే JioHotstar ద్వారా క్రికెట్, సినిమాలు, వినోద కార్యక్రమాలు చూడడం సహా పాటల్ని వినొచ్చు. అదనంగా JioPay ద్వారా డిజిటల్ UPI చెల్లింపుల సదుపాయం కూడా లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ ఎంపిక చేసిన జియోభారత్ మోడళ్లు అయిన A1, B1, B2, B3 ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

Also Read: BSNL Insurance Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ ఇన్సూరెన్స్ మీ కోసం!

Also Read: D2M Live TV Without Internet: మొబైల్‌లో సిమ్, ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ..'D2M' టెక్నాలజీతో సరికొత్త విప్లవం!

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News