SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బంగారం దిగుమతులపై మోదీ సర్కార్‌ కీలక అడుగు.. మార్కెట్‌లో ఏం మారబోతోంది?.. పూర్తి వివరాలు!

Modi Government: బంగారం, వెండి దిగుమతులకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకులు, ప్రభుత్వం ఆమోదించిన నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే వెండి, బంగారం, ప్లాటినంపై ప్రస్తుతం ఉన్న ఐజీఎస్టీకి మినహాయింపును తొలగించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 05, 2026, 12:46 PM IST | Updated: Oct 05, 2026, 12:48 PM IST
Image Credit: Modi Government
Join

Modi Government:  బంగారం, వెండి దిగుమతులకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకులు, ప్రభుత్వం ఆమోదించిన నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే వెండి, బంగారం, ప్లాటినంపై ప్రస్తుతం ఉన్న ఐజీఎస్టీకి మినహాయింపును తొలగించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది.  అక్టోబర్ 7న జరగనున్న సమావేశంలో ఈ విషయంపై చర్చించే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా ప్రస్తుతం.. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై మూడు శాతం ఐజీఎస్టీ విధిస్తున్నారు. అయితే బ్యాంకులు, ప్రభుత్వం ఆమోదించిన నామినేటెడ్ ఏజెన్సీల ద్వారా దిగుమతి చేసుకునే విలువైన లోహాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ సౌకర్యాన్ని 2017లో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో.. విలువైన లోహాలను కేవలం కొన్ని నిర్దిష్ట మార్గాల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకునేవారు. వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పన్ను మినహాయింపును మంజూరు చేశారు. ఇప్పుడు.. పరిస్థితులు మారినందున.. ఈ మినహాయింపును తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమలు అయినట్లయితే..  బులియన్ ఎక్స్ఛేంజీలు, నామినేటెడ్ ఏజెన్సీలకు సమాన అవకాశాలు లభిస్తాయి.

అయితే బంగారం, వెండి దిగుమతులకు సంబంధించి దేశానికి ఎన్నో ఆందోళన కలిగించే అంశంగా మారాయి. ఇవి భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగిస్తాయి. తత్ఫలితంగా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. చైనా తర్వాత ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశంలో బంగారం దిగుమతులకు ప్రధాన కారణం ఆభరణాల పరిశ్రమ నుండి వచ్చే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచింది కేంద్రం. ప్లాటినంపై సుంకాన్ని 6.4శాతం నుండి 15.4శాతానికి పెంచారు. అనవసరమైన దిగుమతులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, ఆగస్టు మధ్య బంగారం దిగుమతులు 3.38శాతం పెరిగి $17.47 బిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో.. వెండి దిగుమతులు 8.81శాతం తగ్గి $1.74 బిలియన్లకు పడిపోయాయి.  కాగా బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే బంగారంపై ఉన్న 3 శాతం ఐజీఎస్టీ మినహాయింపును తొలగించినట్లయితే..  అది దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అయితే  దిగుమతిదారులపై పెరిగిన పన్ను భారాన్ని బులియన్ ధరలు పాక్షికంగా భరిస్తాయి. అయితే చిల్లర వినియోగదారులు బంగారాన్ని కొంచెం ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ, మినహాయింపును తొలగించడం వల్ల బంగారం ధరలు మూడు శాతం పెరుగుతాయని చెప్పలేము. అంతర్జాతీయ ధరలు, రూపాయి విలువ,  దిగుమతి సుంకం వంటి అంశాలు కూడా తుది ధరలను ప్రభావితం చేస్తాయని చెప్పాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES