LPG Subsidy New Rules: దేశంలోని గృహ LPG సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వ సబ్సిడీని పొందుతున్నట్లయితే.. తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ ధరకే సిలిండర్ పొందడానికి అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సిలిండర్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో, వారే ఆ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడానికి.. అసలైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ చేరేలా చూడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ ద్వారా తమ గుర్తింపును ఇంకా ధృవీకరించుకోని ఎల్‌పీజీ వినియోగదారులకు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.
మొదట 2026 జూన్ 30ని గడువుగా నిర్ణయించగా.. ఆ తర్వాత వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ఈ గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇంకా పూర్తి చేయని మిగిలిన వినియోగదారులు అక్టోబర్ 1 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ చేయకపోతే గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోదు. అయితే ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి సబ్సిడీ లభించదు. అటువంటి వినియోగదారులు మార్కెట్ రేటు (సబ్సిడీ లేని సాధారణ ధర) చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనే ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వినియోగదారులు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం ప్రకారం.. ఈ సెప్టెంబర్ 19 నాటికి 274.3 మిలియన్ల LPG వినియోగదారులు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపును పూర్తి చేశారు. ఇప్పటివరకు దాదాపు 89.9 శాతం ఈ-కేవైసీ పూర్తి చేశారు. మిగిలిన కొంతమంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీని సందర్శించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల సింపుల్‌గా ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకోవచ్చు.
ఈ-కేవైసీని ఇలా పూర్తి చేసుకోండి..
సిలిండర్ ఇంటికి డెలివరీ చేసే బాయ్ మొబైల్ యాప్ ద్వారా అక్కడికక్కడే బయోమెట్రిక్/ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
మీ సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ లేదా షోరూమ్‌కి వెళ్లి ఆధార్ ఆధారంగా వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
సంబంధిత కంపెనీల యాప్‌ల ద్వారా కూడా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు:
ఏదైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-2333-555 ను సంప్రదించవచ్చు.