SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంపికకు చివరి అవకాశం.. ఎలా అప్లై చేయాలంటే?

NPS to OPS: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానానికి మారేందుకు మరో అవకాశం కల్పించింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 01, 2026, 12:18 PM IST | Updated: Oct 01, 2026, 12:19 PM IST
Image Credit: NPS to OPS
Join

NPS to OPS: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానానికి మారేందుకు మరో అవకాశం కల్పించింది. అర్హులైన ఉద్యోగులు తమ పెన్షన్ విధానాన్ని మార్చుకునేందుకు ఇదొక వన్ టైం ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 24, 2009 కి ముందు అపాయింటె మెంట్  జారీ చేసి.. జనవరి 1, 2010న లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

అర్హులైన ఉద్యోగులందరూ OPSకు మారడానికి డిసెంబర్ 28, 2026 వరకు గడువు ఇచ్చింది. నిర్దేశించిన సమయంలోగా ఉద్యోగులు ఈ ఎంపికను వినియోగించుకోకపోతే, వారు NPS కిందనే కొనసాగుతారు. ఒకసారి ఉద్యోగి OPSను ఎంచుకున్న తర్వాత, వారు తిరిగి NPSకు మారలేరని నోటిఫికేషన్ స్పష్టం చేస్తుంది.

OPS కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 
అర్హులైన ఉద్యోగులు ముందుగా తమ దరఖాస్తును సంబంధిత డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)కు సమర్పించాలి. DDO ఆ దరఖాస్తును పరిశీలించి.. సంబంధిత విభాగాధిపతి (HOD) లేదా నియామక అధికారికి పంపుతారు. ఆ తర్వాత HOD ఆ విషయాన్ని సంబంధిత పరిపాలనా విభాగానికి పంపుతారు. పరిపాలనా విభాగం నిబంధనల ప్రకారం ఉద్యోగి అర్హతను ధృవీకరించి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, ఒక నెలలోపు OPS కోసం ఆమోద ఉత్తర్వును జారీ చేస్తుంది.

మార్చి 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం తర్వాత ఉద్యోగులలో ఈ డిమాండ్‌కు మరింత ఊపు వచ్చింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం, జనవరి 1, 2004 తర్వాత సర్వీసులో చేరి, NPS అమలు తేదీ (డిసెంబర్ 22, 2003)కి ముందు ప్రకటించిన పోస్టులకు ఎంపికైన వారికి OPSను ఎంచుకోవడానికి ఒకేసారి అవకాశం ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. దీని ఆధారంగా, జమ్మూ కాశ్మీర్‌లోని ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి OPS ప్రయోజనాలను కోరి పొందారు.

అక్టోబర్ 2024లో, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తమ కేంద్రపాలిత ప్రాంతంలోని (UT) ఉద్యోగులకు వర్తిస్తాయా లేదా అనే దానిపై జమ్మూ  కాశ్మీర్ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి స్పష్టత కోరింది. దీనికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు నేరుగా వర్తించవని.. ఈ విషయంపై కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చని DoPPW డిసెంబర్ 6, 2024న పేర్కొంది. తదనంతరం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి, సెప్టెంబర్ 10, 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రతిపాదనను సమర్పించింది. అక్కడ దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2026న అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES