SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

RBI Plastic Notes: మార్కెట్లోకి రూ.10, రూ.20 కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్బీఐ కీలక నిర్ణయం ఎప్పటినుంచి?

RBI Introducing Plastic Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దేశీయ కరెన్సీ రంగంలో విప్లవాత్మక మార్పుకు అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వ ఆమోదంతో, తొలి విడతగా రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్లాస్టిక్ నోట్ల ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Written By Harish Darla
Published: Oct 31, 2026, 03:02 PM IST | Updated: Oct 31, 2026, 03:09 PM IST
Join

RBI Introducing Plastic Notes: దేశంలో కాగితపు నోట్లతో ఎదురవుతున్న మన్నిక సమస్యలకు పరిష్కారంగా ప్లాస్టిక్ నోట్లను పరిచయం చేసేందుకు ఆర్బీఐ చర్యలు వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో తయారీ ప్రక్రియ ఊపందుకుంది. కరెన్సీ ముద్రణకు అవసరమైన పాలిమర్ షీట్ల సరఫరా కోసం ఆర్బీఐ అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించగా, పలు అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ నోట్ల స్వభావం, రంగు, మన్నికను సమగ్రంగా అంచనా వేసిన అనంతరమే వీటిని విడతల వారీగా సాధారణ చలామణిలోకి తీసుకురానున్నారు.

పాలీప్రొపీలిన్ పాలిమర్ షీట్లతో రూపొందించే ఈ కొత్త నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ప్రస్తుత కాగితపు నోట్ల పరిమాణంలోనే వీటిని తయారు చేయడం వల్ల ఏటీఎంలలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా బ్యాంకింగ్ రంగానికి రూ.212.5 మిలియన్ల భారీ వ్యయం ఆదా కానుంది.

పైలట్ ప్రాజెక్ట్, ట్రయల్స్ వివరాలు..
ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.10, రూ.20 విలువైన కరెన్సీ నోట్లను మార్కెట్లోకి చలామణిలోకి తీసుకున్నారు. అలాగే వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం వాడకంలో ఉన్న పేపర్ కరెన్సీ సైజులో ప్లాస్టిక్ నోట్లను ముద్రిస్తారు. ఆ తర్వాత వినియోగదారులు, వ్యాపారుల వాడకంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను తెలుసుకొని వాటిని అధిగమించే విధంగా ఆర్బీఐ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

సాధారణంగా ఏటీఎమ్‌లలో ఉపయోగించే రూ.100, రూ.200, రూ.500 నోట్ల పరిమాణాలకు అనుగుణంగానే ఈ కొత్త రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా ఏటీఎం మెషీన్లలోని డిస్పెన్సర్లు, సెన్సార్లు, అనుబంధ సాంకేతిక వ్యవస్థలను సవరించాల్సిన (రీసెట్ చేయాల్సిన) అవసరం ఉండదు.

గతంలో రూ.100, రూ.200 నోట్ల సైజులు మారినప్పుడు ఏటీఎంల రీసెట్ కోసం బ్యాంకింగ్ వ్యవస్థ దాదాపు రూ.100 కోట్ల వరకు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. అయితే ఈసారి సైజును యథాతథంగా కొనసాగించడం వల్ల రీ - క్యాలిబ్రేషన్ ఖర్చులు తగ్గి, రూ.212.5 మిలియన్ల మేర భారీగా నిధులు ఆదా కానున్నాయి.

నాణ్యతా ప్రమాణాలు, పాలిమర్ షీట్ల నిబంధనలు
ఈ ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ప్రయోగం కోసం ఆర్బీఐ మొత్తం 68 వేల రీముల ప్రత్యేక పాలీప్రొపీలిన్ ప్లాస్టిక్ షీట్లను కొనుగోలు చేయనుంది. విదేశాలలో తయారయ్యే కొన్ని ప్లాస్టిక్ నోట్లలో జంతువుల కొవ్వు ఆధారిత రసాయనాలను ఉపయోగిస్తుంటారు. అయితే, భారత్‌కు సరఫరా చేసే పాలిమర్ షీట్లలో ఎలాంటి జంతు కొవ్వు రసాయనాలు వాడకూడదని ఆర్బీఐ అత్యంత కఠినమైన షరతు విధించింది. ఈ నాణ్యమైన పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే 4 రెట్లు అధిక సమయం మన్నిక కలిగి ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES