Vivo X500 Series: గ్లోబల్ మార్కెట్‌లో వివో స్మార్ట్‌ఫోన్స్‌కి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. గతంలో విడుదల చేసిన X సిరీస్‌ను చాలా మంది యువత ఎంతో ఇష్టంగా కొనుగోలు చేయడంతో వివో X500 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ఇప్పటికి కంపెనీ అనేక స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటినికి హై-ఎండ్ వేరియంట్ అయిన వివో X500 ప్రో మాక్స్‌తో పాటు మరో రెండు మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మోడల్స్‌కి సంబంధించిన ముఖ్యమైన BIS సర్టిఫికేషన్‌ను కూడా పొందినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌లో ఈ సిరీస్ పేరు నమోదవ్వడంతో ఈ మోడల్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వీవో కంపెనీ భారతదేశంలో వివో X500తో పాటు X500 ప్రో, X500 ప్రో మాక్స్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఈ సిరీస్‌కు సంబంధించిన BIS లిస్టింగ్ ఈ విషయాన్ని అందిస్తోంది. ఈ మూడు మోడల్స్ V2619, V2621తో పాటు V2610 నంబర్లతో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మోడల్స్ భారత్‌లో లిస్టింగ్ అవ్వడంతో అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఇక వివో X500 మోడల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది.. ఇందులో 7,500mAh బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 90W వైర్డ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. ఇందులోని ఫ్రంట్ భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తోంది..
వివో X500 ప్రో మోడల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.36-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 6,510mAh బ్యాటరీని కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 90W వైర్డ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక బ్యాక్ కెమెరా సెటప్‌లో మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది.. ఫ్రంట్‌లో సెల్ఫీ కెమెరా 50MP కూడా లభిస్తోంది.. ఇక వివో X500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.85-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేతో పాటు ఎంతో శక్తివంతమైన 7,800mAh బ్యాటరీని కలిగి ఉంది.