• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం

Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం

Cyclone Arnab Impact AP: అర్నబ్ తుఫాన్ ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ వచ్చి ఐదు రోజులైనా వందలాది గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వేలాది ఎకరాల్లో పంటలు నాశనం కావడం, వేల ఇళ్లు దెబ్బతినడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

Written ByHarish Darla
Published: Oct 31, 2026, 04:38 PM IST|Updated: Oct 31, 2026, 04:40 PM IST
joinshare
Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tamil Nadu Health Insurance: తమిళనాడులో ఆరోగ్య బీమా పథకం.. ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలకు పెంపు

Tamil Nadu Health Insurance: తమిళనాడులో ఆరోగ్య బీమా పథకం.. ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలకు పెంపు

2

భారత్‌లోకి Vivo కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 7800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రో మ్యాక్స్!

3

Talasani Srinivas Yadav: బాధ్యతలు విస్మరిస్తోన్న ఎన్నికల సంఘం.. పూర్తిగా విఫలం: మాజీ మంత్రి తలసాని

4

Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం

5

Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Arnab Impact AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200కి పైగా గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 150కి పైగా గ్రామాలు ఐదు రోజులుగా కరెంట్ లేక చీకట్లోనే గడుపుతున్నాయి. ఒక్క కోనసీమ జిల్లాలోనే 8,000కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు మొబైల్ ఫోన్లు, ఇన్వర్టర్లు ఛార్జింగ్ చేసుకోవడానికి జనరేటర్ల ఆధారంగా నడిచే తాత్కాలిక ఛార్జింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్వర్టర్ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి రూ.500, మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌కు రూ.20 చొప్పున చెల్లించాల్సి రావడం బాధితులకు అదనపు భారం అవుతోంది.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు..
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు చెందిన 2,000 మంది, తెలంగాణ నుండి వచ్చిన 1,000 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. అమలాపురం, రాజోలు వంటి పట్టణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించగా, గ్రామీణ ప్రాంతాలకు ఇవాళ సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామని అధికారులు వెల్లడించారు.

భారీగా వ్యవసాయ, ఆస్తి నష్టం..
తుఫాన్ దాటికి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆస్తి, పంట నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. తుఫాను ధాటికి దెబ్బ తిన్న ఇళ్లకు దాదాపుగా 3,500 ఇళ్లు దెబ్బతినగా, 200కి పైగా ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

తుఫాను ధాటికి 20,000 ఎకరాల్లో వరిపంట నేలకొరిగి, ఎకరానికి రూ.40,000 వరకు నష్టం వాటిల్లింది. అలాగే అరటి తోటల్లో నష్టానికి రూ.73,500  ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించగా.. తుఫాను ధాటికి గోదావరి జిల్లాల్లో 73,500 కొబ్బరి చెట్ల నేలకొరిగాయి. మరోవైపు సముద్ర తీరంలో ఉన్న మత్యకారులకు చెందిన 450 మత్య్సకార బోట్లు ధ్వంసమయ్యాయి.

కేంద్ర బృందం పర్యటన, ఆశతో రైతాంగం..
రాష్ట్రంలో తుఫాన్ వల్ల దాదాపు రూ. 4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో నలుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం అందించి ఆదుకోవాలని నష్టపోయిన రైతులు, తుఫాన్ బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
AP News
Andhra Pradesh
Telugu News