SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bank Holiday: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్‌.. ఆదివారం బ్యాంకులు తెరవాలని ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

RBI Orders Banks To Open On Sunday Before 3 Day Strike: తమ న్యాయపరమైన డిమాండ్లు, తమ సమస్యల పరిష్కారం కోసం భారీ సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తుండగా వాటికి బ్రేక్‌ ఇస్తూ.. ఆదివారం బ్యాంకులు తెరవాలని కేంద్రం, ఆర్‌బీఐలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 23, 2026, 04:37 PM IST | Updated: Sep 23, 2026, 04:41 PM IST
Image Credit: Zee Business
Join

Banks on Sunday: ఐదు రోజుల పని దినాలు, వెంటనే ఖాళీల భర్తీతోపాటు తదితర సమస్యలు, డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు భారీ ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక రోజు సమ్మె చేపట్టగా.. నెలాఖరులో మూడు రోజుల సమ్మె చేపట్టనున్నారు. దీనికితోడు వరుసగా సెలవులు రావడంతో మొత్తం ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల సమ్మె నేపథ్యంలో వరుస సెలవులకు బ్రేక్‌ ఇస్తూ ఆదివారం బ్యాంకులు పనిచేయాలని సంచలన ఆదేశాలు ఇచ్చాయి. నాలుగో శనివారం, ఆదివారం సెలవులు ఉండగా.. ఆ ఆదివారం రోజు బ్యాంకులు పనిచేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంటే సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకు సంఘాలు సమ్మెకు వెళ్తున్న విషయం తెలిసిందే. బ్యాంకు వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం బ్యాంకులు తెరచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్‌బీఐ ఆదేశాలు ఇచ్చింది.

సెప్టెంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు సమ్మె ప్రకటించడంతో ఆదివారం బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌లు నిర్ణయించాయి. కేంద్రం, ఆర్బీఐ నిర్ణయంతో ఈ నెల 27వ తేదీన ఆదివారం రోజున బ్యాంకులు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆదివారం పని చేయనున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

సమ్మెకు వెళ్తున్న బ్యాంకు ఉద్యోగులు వరుసగా ఐదు రోజుల సెలవులు వస్తున్నాయని ఆశించగా.. కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వరుసగా ఐదు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఆదివారం రోజు బ్యాంకులు పనిచేయాలని ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఇవ్వడంతో బ్యాంకు ఉద్యోగులు నిరాశ చెందారు. వరుస సెలవులతో భారీ టూర్లు.. శుభకార్యాలు తదితర ప్రణాళికలు వేసుకున్న బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

నాలుగో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజుల సమ్మెతో కలిపితే మొత్తం ఐదు రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆదివారం బ్యాంకులు తెరిచేలా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల డిమాండ్లు ఇవే
వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయాలి. వారంలో రెండు రోజుల సెలవుకు 2024 మార్చిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారానికి అయిదు రోజులే పని చేసి.. రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు బ్యాంకు ఉద్యోగులు అంగీకరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయకపోవడంతో భారీ ఎత్తున సమ్మెకు దిగుతున్నారు.
స్కేల్‌-4, ఆపై అధికారులకే ప్రత్యేకంగా పర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకాన్ని అందరికీ వర్తించాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES