SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Silver Price Crash: జనవరి నాటికి కిలో వెండి ధర రూ. లక్షకు పడిపోనుందా? మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Silver Price Crash News: ఈ ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలను తాకిన వెండి ధరలు ప్రస్తుతం భారీగా పతనమవుతున్నాయి. గతంలో కిలో ధర రూ. 4 లక్షల మార్కును దాటినప్పటికీ, ప్రస్తుతం సుమారు 60% నుంచి 65% మేర దిగివచ్చి రూ. 1,60,000 స్థాయికి పడిపోయింది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఇది మళ్లీ రూ. లక్ష స్థాయికి చేరుకుంటుందా అన్న చర్చ మార్కెట్లో నెలకొంది.

Written By Harish Darla
Published: Nov 22, 2026, 06:00 IST | Updated: Nov 22, 2026, 06:01 IST
Join

Silver Price Crash News: ఈ ఏడాది ఆరంభంలో బంగారాన్ని మించి రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వెండి ధర ప్రస్తుతం అంతే వేగంగా కుప్పకూలింది. దాదాపు 10 నెలల క్రితం కిలో వెండి ధర రూ. 4,10,000 గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం రూ. 1,60,000 స్థాయికి పడిపోయింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ క్షీణత వల్ల కిలో ధర రూ. 1,48,000 వద్ద ట్రేడవుతోంది. అయితే డాలర్ బలోపేతం, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ఈక్విటీల ఒత్తిడి కారణంగా ఈ క్షీణత కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో వెండికి గ్రీన్ ఎనర్జీ, ఈవీ రంగాల వల్ల డిమాండ్ బలంగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు

ధరల పతనానికి గల ముఖ్య కారణాలు..
మార్కెట్ నిపుణుడు ప్రభు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పతనానికి పలు అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు కారణమవుతున్నాయి.
డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల: అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో లోహాల నుంచి పెట్టుబడులు బాండ్ల వైపు మళ్లుతున్నాయి.

వడ్డీ రేట్ల పెంపు భయాలు: డిసెంబర్ తొలి వారంలో జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), యూఎస్ ఫెడ్ (US Fed) సమావేశాల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా విలువైన లోహాల ధరలు తగ్గుతాయి.

ఈక్విటీ మార్కెట్లు, మార్జిన్ కాల్స్: స్టాక్ మార్కెట్లలో హెడ్జింగ్ ఉపసంహరించుకోవడం, మార్జిన్ లోటును పూడ్చుకునేందుకు కమోడిటీలలో పొజిషన్లను విక్రయించడం కూడా ఒత్తిడికి దారితీసింది.

దీర్ఘకాలిక డిమాండ్ - కొనుగోలుదారులకు సూచన..
ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) తయారీకి ప్రతి కారుకు 25 నుంచి 30 కేజీల వెండి అవసరం కావడం, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పారిశ్రామిక వినియోగం స్థిరంగా ఉండటంతో దీర్ఘకాలంలో వెండి ట్రెండ్ బుల్లిష్‌గానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా తమ నిల్వలను విక్రయించడం లేదు.

సాంకేతికంగా వెండికి రూ. 1,40,000 - రూ. 1,41,000 వద్ద కీలక మద్దతు ఉంది. అది బ్రేక్ అయితే రూ. 1,35,000 - రూ. 1,37,000 వరకు రావొచ్చని, అయితే నేరుగా రూ. లక్ష లేదా రూ. 90,000 కి పడిపోతుందని ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. అందువల్ల వెండి కొనాలనుకునే వారు ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు వెలువడే వరకు (డిసెంబర్ 10వ తేదీ వరకు) వేచి చూడటం మంచిదని సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES