SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కుదేలవుతున్న వెండి మార్కెట్.. ఒక్కసారిగా భారీగా తగ్గిన ధరలు! నవంబర్ 17 సిల్వర్ రేట్ ఇదే..!!

Silver Rate: వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పాలి. నేడు నవంబర్ 17వ తేదీన దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర ఒక్కసారిగా భారీగా పతనం అయ్యింది.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 09:16 IST | Updated: Nov 17, 2026, 09:19 IST
Image Credit: SILVER RATE
Join

Silver Rate: వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పాలి. నేడు నవంబర్ 17వ తేదీన దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర ఒక్కసారిగా భారీగా పతనం అయ్యింది. కిలో వెండి ధర రూ. 1,68, 730వద్ద ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే వెండి ధర భారీగా తగ్గడం విశేషమని చెప్పాలి.  మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, వెండి ధరలు భారీగా క్షీణించడం వెనుక అంతర్జాతీయంగా పలు కీలక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వెండిపై నేరుగా ప్రభావం చూపుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ సిల్వర్ ధర ఏకంగా 46.87 డాలర్లకు పడిపోవడంతో.. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడి వెండి రేట్లు కుప్పకూలాయి. దీనికి తోడు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ విలువ బలపడటం వల్ల విలువైన లోహాలపై పెట్టుబడులు తగ్గుతున్నాయని.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ మందగించడం కూడా ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.

సాధారణంగా బంగారంతో పోల్చి చూస్తే వెండి ధరల్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వెండి కేవలం ఆభరణాలు లేదా పెట్టుబడి లోహంగానే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు కూడా భారీగా వినియోగించడమే. పరిశ్రమల నుంచి డిమాండ్ పుంజుకున్నప్పుడు వెండి ధరలు రాకెట్ వేగంతో పైకి ఎగబాకుతాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిమాండ్ కాస్త తగ్గినా, ధరలు అంతే వేగంగా కిందికి పడిపోతుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు వెండిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపు కారణంగా డాలర్ బలపడితే, వెండి ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. యూఎస్‌లో ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఫెడరల్ రిజర్వ్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. అదనంగా, డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపునకు 91శాతం అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. వడ్డీ రేట్లు పెరిగితే, వెండి వంటి వడ్డీ లేని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది.  ధరలు మరింత పడిపోతాయని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది బంగారానికి దీర్ఘకాలిక మద్దతును అందిస్తోంది. అయితే, వెండిని సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు రిజర్వ్‌గా ఉంచవు, అందుకే వెండి ధరలు పడిపోయినప్పుడు, అవి చాలా వేగంగా పడిపోతాయి. బంగారం ధరలు వెండి ధరలంత వేగంగా పడిపోవు. దీనికి ఒక కారణం సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను ఉంచుకోవడమే అని చెబుతారు.

Also Read: 

మీ బేసిక్ సాలరీ లక్ష రూపాయలా? అయితే 10 ఏళ్ల ఉద్యోగం తర్వాత ఎంత గ్రాట్యుటీ అందుతుందో తెలుసా?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES