• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /మీ బేసిక్ సాలరీ లక్ష రూపాయలా? అయితే 10 ఏళ్ల ఉద్యోగం తర్వాత ఎంత గ్రాట్యుటీ అందుతుందో తెలుసా?

మీ బేసిక్ సాలరీ లక్ష రూపాయలా? అయితే 10 ఏళ్ల ఉద్యోగం తర్వాత ఎంత గ్రాట్యుటీ అందుతుందో తెలుసా?

Gratuity Calculator: ఉద్యోగులకు జీతంతోపాటుగా లభించే ముఖ్యమైన ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ఒకటి. ఒకే సంస్థలో కొన్నేళ్లపాటు పనిచేసిన ఉద్యోగులకు కంపెనీ ఈ’ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఉద్యోగం మానేసినప్పుడు రిటైర్మెంట్ చేసిన సమయంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అయితే ఎంత గ్రాట్యుటీ వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByBhoomi
Published: Nov 16, 2026, 16:07 IST|Updated: Nov 16, 2026, 16:09 IST
joinshare
మీ బేసిక్ సాలరీ లక్ష రూపాయలా? అయితే 10 ఏళ్ల ఉద్యోగం తర్వాత ఎంత గ్రాట్యుటీ అందుతుందో తెలుసా?
Image Credit: Gratuity Calculator:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gratuity Calculator: ఉద్యోగులకు జీతంతోపాటుగా లభించే ముఖ్యమైన ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ఒకటి. ఒకే సంస్థలో కొన్నేళ్లపాటు పనిచేసిన ఉద్యోగులకు కంపెనీ ఈ’ మొత్తాన్ని చెల్లిస్తుంది.  ఉద్యోగం మానేసినప్పుడు రిటైర్మెంట్ చేసిన సమయంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అయితే ఎంత గ్రాట్యుటీ వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది.. అర్హతలు, నిబంధనలు ఏంటి? 
సాధారణంగా ఒక సంస్థలో కనీసం 5ఏళ్లపాటు నిరంతరంగా పనిచేసిన ఉద్యోగులు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు రిటైర్మెంట్ పొందినప్పుడు లేదా కొన్ని అసాధారణ సమయాల్లో కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఉద్యోగి సంస్థలో అందించిన సేవలకు గుర్తింపు ఈ ప్రయోజనాన్ని అందిస్తారు.

అయితే, కొన్ని సందర్భాల్లో ఐదేళ్ల సర్వీసు నిబంధన వర్తించదు. సర్వీసులో ఉండగా ఎవరైనా మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా, ఐదేళ్లు పూర్తి చేయడం తప్పనిసరి కాదు. అటువంటి సందర్భాల్లో, నిబంధనల ప్రకారం ఉద్యోగికి లేదా అతని/ఆమె కుటుంబానికి గ్రాట్యుటీ చెల్లింస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ ప్రయోజనాన్ని పొందుతారు. గతంలో, గ్రాట్యుటీ కేవలం శాశ్వత ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించేవారు. అయితే, కొత్త కార్మిక చట్టాలలో ఈ ప్రయోజనాన్ని నిర్ణీత-కాల ఉద్యోగులకు కూడా విస్తరించే నిబంధనలు ఉన్నాయి. నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020 ప్రకారం, నిర్ణీత కాలానికి కాంట్రాక్ట్‌పై పనిచేసే నిర్ణీత-కాల ఉద్యోగులు ఐదేళ్ల సర్వీసు అవసరం లేకుండానే గ్రాట్యుటీని పొందేందుకు అర్హులు.

ఈ మొత్తాన్ని సర్వీసు కాలం ఆధారంగా లెక్కిస్తారు. అంటే, అర్హులైన ఉద్యోగులు వారి కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత కూడా గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందుతారు. ఈ పథకం తాత్కాలిక కాంట్రాక్టులపై పనిచేసే ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. గ్రాట్యుటీ లెక్కింపు ఫార్ములా అనేది ఒక ఉద్యోగికి అందే గ్రాట్యుటీ మొత్తాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ఒక నిర్దిష్ట సూత్రం. ఇది ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఉద్యోగి చివరి జీతం.. వారు కంపెనీలో పనిచేసిన మొత్తం సంవత్సరాల సంఖ్య.

ఇక్కడ, తుది జీతం అనేది ప్రాథమిక జీతం, కరువు భత్యం (DA)ల మొత్తం. గ్రాట్యుటీని లెక్కించే సూత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది.

గ్రాట్యుటీ = తుది జీతం × 15 × సర్వీసు సంవత్సరాలు / 26.

ఈ సూత్రంలో, 15 అంటే ఉద్యోగి ప్రతి సర్వీసు సంవత్సరానికి 15 రోజుల జీతాన్ని లెక్కించడం. మిగిలిన 26 అంటే నెలకు 26 పనిదినాలను ప్రామాణికంగా పరిగణించడం. మిగిలిన నాలుగు ఆదివారాలు ఇందులో చేర్చరు.

ఈ లెక్కింపును రెండు ఉదాహరణలతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి చివరి మూల వేతనం.. డిఏ నెలకు రూ.1 లక్ష అని అనుకుందాం. వారు ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేశారు.

గ్రాట్యుటీని ఈ ఫార్ములా ఉపయోగించి లెక్కిస్తారు: 

రూ.100,000 × 15 × 10 ÷ 26 = రూ.576,923, 

అంటే సుమారుగా రూ.5.77 లక్షలు గ్రాట్యుటీగా అందుతాయి. 

అదే చివరి వేతనం రూ.50,000 అయితే, 10 సంవత్సరాల సర్వీసుకు లెక్కింపు ఇలా ఉంటుంది.

రూ.50,000 × 15 × 10 ÷ 26 = రూ.288,461.54, అంటే సుమారుగా రూ.2.88 లక్షలు గ్రాట్యుటీగా అందుతాయి.

ఈ లెక్కింపులు అర్హులైన ఉద్యోగులకు వర్తించే సాధారణ ఫార్ములా ఆధారంగా వేసిన అంచనాలు. గ్రాట్యుటీ   వాస్తవ మొత్తం ఉద్యోగి అర్హత, వర్తించే చట్టపరమైన నిబంధనలు తుది జీతంపై ఆధారపడి ఉంటుంది.

Also Read: 

 

కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది...అని చెబుతున్న మంత్రి - చెప్పుల మూట నీతి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Business News
Telugu News