SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దూసుకెళ్తున్న రూపాయి.. డాలర్‌కు చెక్ పెడుతూ 8 నెలల గరిష్ఠ స్థాయికి రూపీ.. కారణాలు ఇవే..!!

Stock Market: భారత కరెన్సీ రూపాయి బుధవారం నాటి ట్రేడింగ్‌లో అత్యంత బలమైన ప్రదర్శన కనబరిచింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 56 పైసలు ఎగబాకి.. గత 8 నెలల కాలంలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.

Written By Bhoomi
Published: Nov 25, 2026, 16:37 IST | Updated: Nov 25, 2026, 16:40 IST
Image Credit: Stock Market
Join

Stock Market: భారత కరెన్సీ రూపాయి బుధవారం నాటి ట్రేడింగ్‌లో అత్యంత బలమైన ప్రదర్శన కనబరిచింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 56 పైసలు ఎగబాకి.. గత 8 నెలల కాలంలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒక దశలో డాలర్ మారకంతో రూపాయి విలువ 92.29 వద్ద ట్రేడైంది. ఈ అనూహ్య పుంజుకోవడంతో, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన నష్టాలన్నింటినీ రూపాయి పూర్తిగా పూడ్చుకున్నట్లయింది.

బుధవారం ఉదయం 92.65 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి.. సమయం గడుస్తున్న కొద్దీ క్రమంగా బలపడుతూ 92.29 స్థాయిని తాకింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన నమోదైన 92.28 స్థాయి తర్వాత రూపాయికి ఇదే అత్యంత గరిష్ఠ విలువ కావడం విశేషం.

రూపాయి బలపడటానికి ప్రధాన కారణాలు ఇవే:

స్టాక్ మార్కెట్ల జోరు:

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికి పైగా భారీ లాభాలను నమోదు చేయడం రూపాయి సెంటిమెంట్‌కు ప్రధాన బలంగా మారింది. ముఖ్యంగా మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు లాభాలకు కీలక కారణంగా నిలిచాయి.

విదేశీ పెట్టుబడుల వెల్లువ:

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) తిరిగి భారత మార్కెట్లలోకి భారీ స్థాయిలో నిధులను కుమ్మరించడం రూపాయికి కలిసొచ్చింది. తాజా నివేదికల ప్రకారం, ఈ నవంబర్ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో 14.28 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత స్టాక్స్‌లో పెట్టారు.

దిగొచ్చిన ముడిచమురు ధరలు:

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోవడంతో పాటు.. ఈ నెలలో మొత్తంగా దాదాపు 24 శాతం మేర తగ్గడంతో దేశ దిగుమతుల బిల్లు భారం గణనీయంగా తగ్గనుంది.

ఈ సానుకూల పరిణామాలన్నీ ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి డిమాండ్‌ను పెంచి.. అమెరికా డాలర్‌తో పోలిస్తే దాని విలువను మరింత పటిష్ఠం చేశాయి.

Also Read:

ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్.. రూ. లక్ష పెడితే రూ. 2 లక్షలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇదే!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES