• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /JB Srinivas: తిరుపతిని అభివృద్ధి పథంలో నిలుపుతా.. బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్‌!

JB Srinivas: తిరుపతిని అభివృద్ధి పథంలో నిలుపుతా.. బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్‌!

JB Srinivas Takes Charge As Tirupati Mayor: తిరుపతి నగరం అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని.. అభివృద్ధి పథంలో నడిపిస్తానని కొత్త మేయర్‌ జేబీ శ్రీనివాస్‌ ప్రకటించారు. తిరుపతి మేయర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టగా.. నగర అభివృద్ధి కోసం తన ప్రణాళిక వివరించే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 25, 2026, 16:46 IST|Updated: Nov 25, 2026, 16:49 IST
joinshare
JB Srinivas: తిరుపతిని అభివృద్ధి పథంలో నిలుపుతా.. బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్‌!
Image Credit: Source: JB Srinivas Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

2

JB Srinivas: తిరుపతిని అభివృద్ధి పథంలో నిలుపుతా.. బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్‌!

3

Bihar: వామ్మో.. భర్త డబ్బులతో కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

4

దూసుకెళ్తున్న రూపాయి.. డాలర్‌కు చెక్ పెడుతూ 8 నెలల గరిష్ఠ స్థాయికి రూపీ.. కారణాలు ఇవే..!!

5

రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirupati Mayor JB Srinivas: మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన యువ నాయకుడు జేబీ శ్రీనివాస్‌ తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థలో నూతన మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా కొత్త మేయర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మేయర్ బాధ్యతలు స్వీకరించడంతో నగరపాలక సంస్థలో కొత్త పాలనకు అడుగు ముందుకు పడింది.

తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌గా జేబీ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమై నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించనున్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నూతన మేయర్ జేబీ శ్రీనివాస్‌ ముందున్న ప్రధాన లక్ష్యం. మేయర్ బాధ్యతల స్వీకరణతో నగర ప్రజల్లో అభివృద్ధిపై కొత్త ఆశలు నెలకొన్నాయి.

తిరుపతి మున్సిపల్‌ కౌన్సిలర్లు సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణస్వీకారంలో మేయర్‌గా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ (జేబీ శ్రీనివాస్) ప్రమాణం చేయగా బుధవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Telugu News
AP News