• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

Daughter Gifts Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ కూతురు తన తండ్రికి మొదటి జీతంలో గిప్ట్‌ ఇచ్చిన ఘటన విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను చేసి పని అందరినీ ఆకట్టుకుంటోంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 25, 2026, 16:58 IST|Updated: Nov 25, 2026, 17:01 IST
joinshare
తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!

2

JB Srinivas: తిరుపతిని అభివృద్ధి పథంలో నిలుపుతా.. బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్‌!

3

Bihar: వామ్మో.. భర్త డబ్బులతో కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

4

దూసుకెళ్తున్న రూపాయి.. డాలర్‌కు చెక్ పెడుతూ 8 నెలల గరిష్ఠ స్థాయికి రూపీ.. కారణాలు ఇవే..!!

5

రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Daughter Gifts Viral Video: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడుతూ ఉంటారు.. తమ కోరికలను పక్కన పెట్టి.. పిల్లల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. అయితే, ఆ పిల్లలు ప్రయోజకులై, తమ మొదటి సంపాదనతో తల్లిదండ్రులకు ఏదైనా గిఫ్ట్‌ ఇచ్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వివరించడం చాలా కష్టం.. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. ఓ కూతురు తన మొదటి జీతంతో తండ్రికి ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్‌లో @mndavi_shrma అనే ఖాతా నుంచి షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.. వీడియోలో ఒక సాధారణ ఇంట్లో.. ఆకుపచ్చ రంగు గోడలు ఉన్న చిన్న గదిలో ఓ తండ్రి మంచం మీద కూర్చుని ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఆయన ఎదురుగా నిలబడిన కూతురు.. తన చేతిలో న్యూస్ పేపర్‌లో చుట్టిన ఒక చిన్న ప్యాకెట్‌ను తండ్రికి ఇవ్వడం మీరు గమనించవచ్చు. అందులో ఏముందో తెలియక ఆ తండ్రి ఎంతో ఆసక్తిగా.. నెమ్మదిగా ఆ పేపర్‌ను విప్పడం కూడా మీరు గమనించవచ్చు..

పేపర్ విప్పగానే అందులో ఒక బైక్ తాళం చెవి కనిపిస్తుంది... దీనిని చూసి ఆ తండ్రి ఎంతగానో ఆశ్చర్యపోవడం మీరు చూడొచ్చు.. ఆ తాళం చెవిని చేతిలోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు.. తన కూతురు తనకోసం కొత్త  రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొనుగోలు చేసిందని తెలుసుకున్న ఆ తండ్రి ముఖంలో వెలుగు చూసి.. తన కూతురు ఎంతగానో ఆనందంగా ఉండడం మీరు చూడొచ్చు. ఒకవైపు కళ్లలో ఆనందబాష్పాలు, మరోవైపు కూతురిపై అంతులేని ప్రేమ ఆయన నవ్విన తీరు అందరినీ కట్టిపడేసేలా చేసింది.. ఆ తండ్రి తన కొత్త బుల్లెట్ బైక్ పక్కన నిలబడి ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులివ్వడం కూడా ఈ తర్వాత వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆ యువతి రాసిన మాటలు అందరినీ కదిలిస్తూ వస్తున్నాయి..  నాకు అన్నీ చేసి ఆయన తన జీవితాన్ని ధారబోశారు.. ఈరోజు నా సొంత సంపాదనతో ఆయనకు ఒక చిన్న కానుక ఇచ్చే అవకాశం నాకు దక్కింది.. అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ వస్తున్నారు.  ఒక తండ్రికి తన కూతురు ఇచ్చే మంచి గౌరవం ఇదే.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఈ వీడియో చూస్తుంటే నా కళ్లకు నీళ్లు వస్తున్నాయి.. నేను కూడా నా నాన్నకు ఇలాగే సర్‌ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని మరొకరు రాసుకొచ్చారు.. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Mandavi Sharma🤍 (@mndavi_shrma)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News