UPI Payment Charges News: దేశవ్యాప్తంగా ఏటికేడాది యూపీఐ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వీసా (Visa), మాస్టర్ కార్డ్ (Mastercard) వంటి అమెరికన్ సంస్థల ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశంలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానుంది
ప్రజలు, విపక్షాల వ్యతిరేకత..
రూ. 2,000 దాటిన లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే నిర్ణయంపై సాధారణ ప్రజల నుండి, విపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకతపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేస్తూ స్పష్టతనిచ్చింది. రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లిస్తారని ప్రభుత్వం వివరించింది.
ఎన్‌సీపీఐ స్పష్టత, అమలు తేదీ..
'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) కూడా ఈ అంశంపై స్పందిస్తూ, వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న విధంగానే యూపీఐ సేవలు ఉచితంగానే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15 నుండి అమల్లోకి వస్తుందని ఎన్‌సీపీఐ ప్రకటించింది.
విపక్షాలు, నిపుణుల ఆందోళన..
కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీపీఐ వినియోగదారులపై నేరుగా భారం పడదని చెబుతున్నప్పటికీ, విపక్షాలు ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. వ్యాపారులపై భారం పడినప్పుడు, వారు పరోక్షంగా ఆ మొత్తాన్ని వినియోగదారులపైనే మోపుతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థిక రంగ నిపుణులు కూడా ఇదే విషయమై హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు తమపై పడే చిన్నపాటి భారాన్ని కూడా వినియోగదారులపైకి బదిలీ చేయడం ప్రారంభిస్తే, యూపీఐ లావాదేవీలు నెమ్మదించే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also REad: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!
Also Read; వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook