WION World Conferences: దేశంలోనే మొదటి.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ WION విజయవంతంగా పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. డెకేడ్ మైలురాయికి చేరువైన ఈ శుభ తరుణంలో జీ మీడియా కార్పొరేషన్ సీఈవో రక్తిమ్ దాస్.. అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. గ్లోబల్ థాట్ లీడర్ షిప్, లైఫ్ స్టైల్ విభాగాలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. 'WION World Conferences'.. 'WION Luxe' అనే రెండు కొత్త గ్లోబల్ ఫ్లాట్ ఫామ్స్ ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఐటీసీ మౌర్య హోటల్లో బుధవారం ఎంతో ఘనంగా నిర్వహించిన 'WION ఐకానిక్ టూరిజం సమిట్ అండ్ అవార్డ్స్ 2026' సదస్సులో రక్తీమ్ దాస్ ఈ కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించారు.
గ్లోబల్ డెవలప్ మెంట్, దౌత్యం, వ్యూహాత్మకమైన అంశాలపై ప్రపంచ మేధావులు ఒకే వేదికపై చర్చించే విధంగా ఈ కాన్ఫరెన్స్ లను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త సాంకేతికతలు, డిఫెన్స్, గ్లోబల్ డిప్లొమసీ, పర్యావరణ పరిరక్షణ-సుస్థిరత, ఇంటర్నేషనల్ టూరిజం, బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్టర్ వంటివి ప్రధాన విభాగాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలసీ మేకర్స్, బిజినెస్ మెన్స్, ఆవిష్కర్తలు, మేధావులందర్నీ ఒకే గొడుకు కిందకు తీసుకురావడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం మార్పు గురించి మాత్రమే మాట్లాడకుండా.. సరికొత్త ఆలోచనలను పంచుకుంటూ.. దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పటిష్టం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని రక్తిమ్ దాస్ పేర్కొన్నారు.
ఇక అంతర్జాతీయ లగ్జరీ, విలాసవంతమైన లైఫ్ స్టైల్, టూరిజం రంగానికి సరికొత్త గ్లోబల్ విజన్ను అందించే ప్రత్యేక వేదికగా WION Luxe పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని లగ్జరీ రంగాన్ని రీడిఫైన్ చేస్తున్న ప్రభావవంతమైన వ్యక్తులు, విశిష్టమైన ప్రాంతాలు, సరికొత్త ఆవిష్కరణలు, మరువలేని అనుభవాలను అంతర్జాతీయ స్థాయి ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. WION బ్రాండ్ మూల సూత్రమైన "World Is One" ప్రపంచమంతా ఒక్కటే.. అనే తత్వాన్ని టెలివిజన్ స్క్రీన్ల పరిమితులను దాటించి.. ప్రత్యక్ష చర్చలకు, అంతర్జాతీయ బంధాలకు వేదికగా మారుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ సనాతన ధర్మ భావన అయిన వసుదైన కుటుంబాన్ని ఉటంకిస్తూ.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. సంఘర్షణలతో సతమతమవుతున్న ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, సాంస్క్రుతిక వారధులను నిర్మించేందుకు గ్లోబల్ ట్రావెల్, టూరిజం అత్యంత శక్తివంతమైన సాధానాలని రక్తీమ్ దాస్ అభిప్రాయపడ్డారు.
ఇంకా మాట్లాడుతూ.. మా గత పదేళ్ల జర్నీ ఎంతో అద్బుతంగా ముగిసింది. ఇక భవిష్యత్తులోనూ ప్రపంచ సరిహద్దులను దాటి అపరిమితమైన అవకాశాలు మన కోసం వేచి ఉన్నాయి అంటూ ముగించారు సీఈవో రక్తిమ్ దాస్.