• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు.. తెలుగు రాష్ట్రాల అంబానీ, అదానీలు వీళ్లే..

తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు.. తెలుగు రాష్ట్రాల అంబానీ, అదానీలు వీళ్లే..

World class Telangana billionaires: అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రపంచ స్థాయి కుబేరులు పుట్టుకొస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలతో దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతూ... ప్రపంచ స్థాయి కుబేరులుగా రికార్డు క్రియేట్ చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ నిఖార్సయిన వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. ఇపుడు ప్రపంచ స్థాయి కుబేరుల సరసన చేరారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేరులతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ వాసులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతకీ వాళ్లెవరు? తెలంగాణనుంచి ప్రపంచకుబేరులుగా గుర్తింపు పొందిందెవరు? వాళ్లు ఎంత సంపద సృష్టించారు? ఏ రంగంలో ప్రపంచ కుబేరులుగా ఎదిగారు? జీ తెలుగు న్యూస్‌ స్పెషల్ ఫోకస్..!!

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 01:28 PM IST|Updated: Sep 27, 2026, 01:33 PM IST
joinshare
తెలంగాణలో  ప్రపంచ స్థాయి కుబేరులు.. తెలుగు రాష్ట్రాల  అంబానీ, అదానీలు వీళ్లే..
Image Credit: Richest Persons Of India (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

New Benchmark Billionares: ఉపాధికోసం ఉద్యోగం చేస్తే పూట గడుస్తుంది.. అదే వ్యాపారం చేస్తే లాభాలు ఆశాజనకంగా సొంతం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం కావొచ్చు. ఇదీ పారిశ్రామిక వేత్తల పంధా. పుట్టుకతో ఎవ్వరూ సంపన్నులు కాదు.. పరిస్థితులకు అనుగుణంగా కష్టపడటమే కాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. పెట్టుబడికి ఢోకాలేని వ్యాపారాన్ని ఎంచుకోవడంలోనే విజయం దాగి ఉందని నిరూపించి విజేతలుగా నిలిచారు.పదుగురికి ఉపాధి కల్పించడం... రూపాయితోనే రూపాయి సంపాదించి.. కోట్ల సంపదను సృష్టించి ప్రపంచ కుబేరులుగా రాణించారు. ప్రపంచ కుబేరుల సరసన నిలిచివారంతా ఫార్మారంగాన్ని ఎంచుకున్న వారు పారిశ్రామిక దిగ్గజాలుగా... ప్రపంచ కుబేరులుగా పేరుగాంచారు.


ఉపాధికోసం ఓ సంస్థలో చేరడం... వ్యాపార మెళకువలు తెలుసుకుని పరిశ్రమలు స్థాపించడమంటే ఆషామాషీ కాదు. సాధారణ జీవితం గడిపే స్థాయి నుంచి కొన్ని వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిన వాళ్లు తెలంగాణాకే కాదు.. ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచారు. తెలంగాణ నుంచి అత్యంత ప్రభావ శీలి వ్యక్తిగా ప్రపంచ కీర్తిని గడించారు హైదరాబాద్ కేంద్రంగా దివీస్ ల్యాబ్స్ అధినేత దివి మురళి. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు లక్షల కోట్ల ఆస్తి కలిగి అపర కుభేరుడిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు. 

సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివి మురళిది ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం ప్రాంతం. 14 మంది సభ్యులున్న కుటుంబంలో ఒకడిగా ఎదిగిన దివి మురళి... ఇంటర్మీడియట్ లో రెండు సార్లు ఫెయిలయ్యాడు. చదువులో పాసవ్వడంకంటే జీవితంలో పాసయ్యే మార్గాన్ని తనకు తానే నిర్ధేశించుకున్నాడు. తప్పిన ఇంటర్మీడియట్ కోర్సును పూర్తిచేసి... మణిపాల్ హయ్యర్ స్టడీస్ లో బియస్సీ పూర్తి చేశాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. దివి మురళి ఆశయాలు చాలా గొప్పవే కానీ... వాటిని సాధించే పరిస్థితులు మాత్రం అంతంత మాత్రమే. అయినప్పటికీ సంకల్ప బలంతో పరిశ్రమను స్థాపించి గొప్పస్థాయికి ఎదిగారు. దివి మురళి ఇపుడు ఒక లక్ష 25వేల 400 కోట్ల నెట్ వర్త్ తో తెలంగాణలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అపర కుభేరుడిగా భారతీయులు ఎందరికో మురళీ  ఆదర్శంగా నిలిచారు. ఉన్నట్లుండి సంపద సృష్టించలేదు. నాలుగు దశాబ్ధాల నిర్విరామ కృషితో కోటీశ్వురుడిగా ఎదిగారు. వేలమందికి ఉపాధికల్పిస్తూ... దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమయ్యారు.


డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు రూ. 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మురళి చేతిలో ఉన్న డబ్బు రూ. 500. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకి వెళ్ళగలిగారు‌. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు‌. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు.

పొరుగుదేశంలో పేరు, డబ్బు సంపాదించుకున్న మురళి 1984 సంవత్సరంలో 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు‌. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ... రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995లో  రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చిన మురళీ సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఏడేళ్ళ తర్వాత 2002 లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నం చిప్పాడలో నెలకొల్పారు. ఈ రెండు ఫార్మ కంపెనీలు, రా డ్రగ్ తయారి పరిశ్రమలుగా ప్రత్యక్షంగా వేలాది మందికి.. పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రపంచంలో ఫార్మాస్యుటికల్ రంగానికి క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా  రూ. 8800 కోట్లు వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది‌. రోజురోజుకీ ఎదుగుతూ ప్రస్తుతం మురళీ దివి లక్ష కోట్లకుపైగా సంపాదించి హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరు గడించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల్లో తెలుగోడు సాధించిన గొప్పవిజయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మేఘా  కృష్ణారెడ్డి..

తెలుగు రాష్ట్రాల్లో మేఘాఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వ్యవస్థాపకులు పామిరెడ్డి పిచ్చిరెడ్డి ఎంచుకున్న మార్గంలో అద్భుతాలను ఆవిష్కరించారు. తన మేనల్లుడు పీవీ కృష్ణారెడ్డితో కలిసి సంస్థను దేశంలోనే ఉన్నతంగా తీర్చి దిద్దారు. తెలంగాణ నుంచి ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. 53వేల వందకోట్ల రూపాయల నెట్‌వర్త్ తో పామిరెడ్డి పిచ్చిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఆయన సహభాగస్వామి, మేనల్లుడు పీవీకృష్ణారెడ్డి  52వేల వందకోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచారు.

పామిరెడ్డి పిచ్చిరెడ్డి 1989లో హైదరాబాద్‌లో  రూ.5 లక్షల పెట్టుబడితో  మేఘా ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ ను స్థాపించారు. అప్పుడు కేవలం ఇద్దరు ఉద్యోగులతో ఆసంస్థను నడిపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, ప్రారంభంలో మున్సిపాలిటీల కోసం చిన్న పైపుల తయారీ యూనిట్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత ఆయన మేనల్లుడు పీవీ కృష్ణారెడ్డి మేఘా సంస్థలో చేరారు. ఇద్దరూ కలిసి మేఘా ఇంజినీరింగ్ సంస్థను ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు. హైదరాబాద్‌లో 1989లో ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్‌గా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్.. 2006లో ఈ సంస్థ పేరును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్  గా మార్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో టన్నెల్స్, పోర్టులు, హైవేలు, వాటర్ సిస్టమ్స్, పవర్ ప్రాజెక్ట్‌లతో భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజంగా అవతరించింది.

మామా అల్లుళ్ల ఆధ్వర్యంలో మేఘా ఇంజినీరింగ్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ కేవలం మున్సిపాలిటీ కోసం పైపుల తయారీ నుంచి నీళ్ల డ్యామ్ లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి భారీ ఎత్తిపోతల పథకాలు, జాతీయ రహదారులు, పవర్ ప్లాంట్లు,  జోజిలా టన్నెల్ వంటి ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్‌లో కీలక యాజమాన్య మార్పులు జరిగాయి. మేనేజింగ్ డైరెక్టర్ పి.వి. కృష్ణారెడ్డి తన మేనమామ పి.పి. రెడ్డికి చెందిన 43శాతం వాటాను కొనుగోలు చేసి, కంపెనీపై పూర్తి నియంత్రణ సాధించేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుండి 6,000 కోట్లకు పైగా ప్రైవేట్ క్రెడిట్ సేకరించే ప్రక్రియలో ఉన్నారు.

హెటిరో పార్థసారథి.. 
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి రూ. 39వేల 30కోట్లతో తెలంగాణలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. ఓ మారుమూల పల్లెటూరిలో... ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన పార్థసారథి  ఇప్పుడు దేశంలోనే టాప్ 100 ధనవంతుల్లో ఒకరుగా పేరు గడించారు. చిన్నప్పుడు అంబాసిడర్ కారును చూసి చప్పట్లు కొడుతూ గంతులేసి మురిసిన కుర్రాడు... ఇప్పుడు కారు కాదు దాని నంబర్ ప్లేటుకే 25లక్షల రూపాయలు ఖర్చు చేశారు. తెలుగు బిడ్డ, ప్రముఖ వ్యాపారవేత్త బండి పార్థసారథి రెడ్డి ప్రగతి ప్రస్థానం యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు.

ఓ మారుమమూల పల్లెటూళ్లో పుట్టిపెరిగిన పార్థసారథి రెడ్డి ఎంతో కష్టపడి బిలియనీర్ స్థాయికి ఎదిగారు. ఎక్కడ పుట్టాం... ఎక్కడ చదివామన్నది కాదు... ఎలా కష్టపడ్డాం... ఏం సాధించామన్నదే ముఖ్యమని నిరూపించారు బండి పార్థసారథి రెడ్డి.హెటిరో డ్రగ్స్ సంస్థను స్థాపించి ప్రపంచ దేశాలకు ఎగుమతిచేసే స్థాయికి ఎదిగారు. ఇపుడు ప్రపంచంలోనే యాంటి రెట్రోవైరల్ ఔషధాలను తయారుచేసే అతిపెద్ద కంపెనీగా  హెటిరో డ్రగ్స్ పేరుగాంచింది.  


ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మారుమూల గ్రామం కందుకూరు. అక్కడ నివసించే శ్రీనివాసరెడ్డి, సోమకాంతమ్మ దంపతులకు మార్చి 6, 1954 లో జన్మించాడు పార్థసారథి రెడ్డి. అతడి చిన్నతనమంతా ఆ గ్రామంలోనే గడిచింది... ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడక్కడే సాగింది. ఆయన ఉన్నత విద్యాబ్యాసమంతా ప్రభుత్వ కాలేజీల్లోనే సాగింది... ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జెవిఆర్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేశారు. తర్వాత పిజి కోసం హైదరాబాద్ వచ్చారు... ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. అనంతరం ఇదే యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తిచేశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేరిన పార్థసారథి రెడ్డి...  ఎవరిదగ్గరో పనిచేయడం ఎందుకు... మనమే ఓ కంపెనీ నడిపించలేమా? అనే ఆలోచనతో పుట్టుకొచ్చింది హెటిరో డ్రగ్స్. పార్థసారథి రెడ్డి ఎంతో కష్టపడి ఒకరిద్దరితో ప్రారంభించిన సంస్థను ఇపుడు 10 వేల మంది ఉద్యోగులు కలిగిన మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. పల్లెటూరి నుండి చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చిన వ్యక్తి కోటీశ్వరుడిగా మారారు.  ఫార్మా రంగంలో రారాజుగా రాణిస్తున్నారు.

ఓసాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెనక వెంకట రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా అధినేతగా రాణించి 39వేల కోట్లకు అధిపతిగా రాణిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఫార్మారంగంలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. భారతీయ ఫార్మా రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరైన పెనక వెంకట రాంప్రసాద్ రెడ్డి   ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా సహ-వ్యవస్థాపకుడు. ఒక సాధారణ అకౌంటెంట్, క్లర్క్ స్థాయి నుండి కోటీశ్వరుడిగా, ఫార్మా టైకూన్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం భారతీయ కార్పొరేట్ రంగంలో యువపారిశ్రామిక వేత్తలకు ఆదర్శం.

రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరులో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యాపారంలోకి రాకముందు ఆయన కొన్ని ఫార్మా కంపెనీలలో అకౌంటెంట్‌గా, పర్చేజ్ క్లర్క్‌గా పనిచేశారు. ఈ అనుభవమే ఆయనకు ఫార్మా రంగంపై ప్రాథమిక అవగాహనను కల్పించింది. 1986లో తన బంధువు  కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ నిత్యానంద రెడ్డితో కలిసి పుదుచ్చేరిలో  మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో అరబిందో ఫార్మాను ప్రారంభించారు.  వ్యాపారం ప్రారంభించడానికి నిధుల కోసం కుటుంబానికి చెందిన వెండి వస్తువులను సైతం తాకట్టు పెట్టి పెట్టుబడిని సమకూర్చారు. తొలుత బల్క్ డ్రగ్స్ ట్రేడింగ్ సంస్థగా ఇది ప్రారంభమైంది. రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో అరబిందో కేవలం బల్క్ డ్రగ్స్ తయారీకే పరిమితం కాకుండా, ఫార్ములేషన్స్ టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారీ రంగంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది.

నాణ్యమైన జనరిక్ మందులను అత్యంత తక్కువ ధరకే ప్రపంచ దేశాలకు అందించాలనేది ఆయన వ్యూహం. హెచ్ఐవి,ఎయిడ్స్, డయాబెటిస్, గుండె జబ్బులకు సంబంధించిన జీవిత రక్షక ఔషధాలను సరసమైన ధరలకే అందించడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అరబిందో ఫార్మా 35కు పైగా తయారీ కేంద్రాలు, 9 పరిశోధనా కేంద్రాలతో   ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలకు మందులను ఎగుమతి చేస్తోంది. అమెరికా జనరిక్ మార్కెట్లో అరబిందో సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా అరబిందో ఫార్మా USA INC ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటూ వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందిస్తున్నారు. సాధారణ నేపథ్యం నుండి వచ్చి, పట్టుదల, వ్యాపార చతురత,  సాహసోపేతమైన నిర్ణయాలతో అరబిందో ఫార్మాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన పి.వి. రాంప్రసాద్ రెడ్డి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

అరవిందో ఫార్మాసీ.. 
2008లో 'వరల్డ్ ఫార్మాస్యూటికల్ ఫ్రంటియర్స్' ప్రపంచ ఫార్మా రంగంలో అత్యంత ప్రభావవంతమైన టాప్ 35 వ్యక్తులలో ఒకరిగా ఆయన్ను ప్రకటించింది. భారత ఫార్మా రంగానికి చేసిన సేవలకు గానూ రాంప్రసాద్ రెడ్డి 2010లో పద్మశ్రీ  , 2011లో  ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఫోర్బ్స్  నివేదికల ప్రకారం, భారతదేశంలోని అత్యంత ధనవంతులలో రాంప్రసాద్ రెడ్డి ఒకరిగా కొనసాగుతున్నారు.

గ్రీన్ ఎనర్జీ సుందర్.. 
తెలంగాణకు చెందిన మరో పారిశ్రామిక దిగ్గజం గ్రీన్ ఎనర్జీ అధినేత సాలుజ సురేందర్ 29వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో సంపన్నుల సరసన నిలిచారు. తెలంగాణకే తలమానికమైప సోలాల్ మాడ్యూళ్ల తయారీలో అగ్రగామిగా రాణిస్తున్నారు. 1995లో హైదరాబాద్ వేదికగా Premier Energies సంస్థను స్థాపించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా సోలార్ సెల్స్, సోలార్ మోడ్యూల్స్ తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా కొనసాగుతోంది.  తెలంగాణలో ఈ సంస్థకు 5 అత్యాధునిక తయారీ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్,  మోడ్యూల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం నుండి 'అవుట్‌స్టాండింగ్ ఆంట్రప్రెన్యూర్' జాతీయ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

జూపల్లి రామేశ్వరరావు ..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన జూపల్లి రామేశ్వరరావు 25వేల కోట్ల నెట్‌వర్త్‌తో తెలంగాణ నుంచి కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. హోమియో డాక్టరుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత  మైహోమ్ ఇండస్ట్రీస్ పేరుతో మహా సిమెంట్స్ పరిశ్రమను స్థాపించి దక్షిణభారత దేశంలోనే ఉన్నతమైన కంపెనీగా తీర్చిదిద్దారు.  1981లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి, 1986లో 'మై హోమ్' నిర్మాణ సంస్థను స్థాపించారు. జూపల్లి ఏ ప్రాజెక్టును చేపట్టినా బంగారమే. హైదరాబాద్‌లో అనేక నివాస, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మించారు. జూపల్లి రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ రంగంలో నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సంస్థ మైహోమ్స్ సంస్థను తీర్చిదిద్దారు.  జీయర్‌ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యాసంస్థలు, మీడియా, పవర్ రంగాల్లోనూ రాణిస్తున్నారు.

మహిమా దాట్ల..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ, ఫార్మాస్యుటికల్ కంపెనీ అధినేత దాట్ల మహిమ 15వేల 900 కోట్ల రూపాయల నెట్వర్త్ తో సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. భారత దేశంలోనే తొలి ప్రైవేటు రంగం బయోలాజికల్ ఉత్పత్తుల కంపెనీగా  1953 డిసెంబర్ 10న ఏర్పాటైంది. డాక్టర్ దాట్ల విజయ్ కుమార్  చేత స్థాపించబడిన ఈ కంపెనీ మంచి గుర్తింపుపొందింది. ఇపుడు ఈ కంపెనీకి దాట్ల మహిమ మేనేజింగ్ డైరెక్టర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ద్వారా  వ్యాక్సిన్‌లు  , బయోలాజికల్స్, ఫార్ములేషన్స్,  యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ తయారీలో కీలకపాత్ర పోషిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకటిగా పేరుగాంచింది. యూనిసెఫ్  , డబ్ల్యూహెచ్‌వో  వంటి అంతర్జాతీయ సంస్థలకు కీలక సరఫరాదారుగా ఉంది. కోవిడ్ సమయంలో కార్బెవ్యాక్స్  వ్యాక్సిన్‌ను  అభివృద్ధి చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News
AP News