• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Zee Entertainment: క్యూ2 ఫలితాల్లో 'జీ ఎంటర్‌టైన్‌మెంట్‌' జోరు.. 13 శాతం లాభాలతో దూకుడు

Zee Entertainment: క్యూ2 ఫలితాల్లో 'జీ ఎంటర్‌టైన్‌మెంట్‌' జోరు.. 13 శాతం లాభాలతో దూకుడు

Zee Entertainment Revenue Grows 13 Percent In Q2 Results: ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆర్థిక ఫలితాల్లో అద్భుతాలు సాధించింది. క్యూ2 ఫలితాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ లాభాలు పొందింది. ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతూ వచ్చిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆర్థిక ఫలితాల్లో దూకుడు కనబర్చింది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 09:38 PM IST|Updated: Oct 30, 2026, 09:45 PM IST
joinshare
Zee Entertainment: క్యూ2 ఫలితాల్లో 'జీ ఎంటర్‌టైన్‌మెంట్‌' జోరు.. 13 శాతం లాభాలతో దూకుడు
Image Credit: Source: X (Twitter)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
DMart Shopping Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకు సరుకులు కొనాలా? షాపింగ్‌కు వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్!

DMart Shopping Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకు సరుకులు కొనాలా? షాపింగ్‌కు వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్!

2

Varalaxmi Sarathkumar: చందమామ కనిపించకపోయినా.. భార్య కోసం చంద్రుడినే వెరైటీగా తీసుకొచ్చిన వరలక్ష్మి భర్త!

3

Zee Entertainment: క్యూ2 ఫలితాల్లో 'జీ ఎంటర్‌టైన్‌మెంట్‌' జోరు.. 13 శాతం లాభాలతో దూకుడు

4

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ లో ఏకంగా 16రోజులు బ్యాంకులు బంద్..!!

5

Singareni Diwali Bonus: సింగరేణి కార్మికులకు మరోసారి పండగ బోనస్..దీపావళికి రూ.1.10 లక్షలు ప్రకటన! కార్మికుల కళ్లల్లో ఆనందం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Entertainment Q2 Results: వినోద రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తూ.. అశేష ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ క్యూ2 ఫలితాల్లో దూకుడు కనబర్చింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌, సీరియల్స్‌ మాత్రమే కాకుండా  క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ లాభాలు అందుకుంది. రెండో త్రైమాసికంలో (క్యూ2) ఫలితాల్లో రెట్టింపు ఆదాయం లభించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ క్యూ2 ఫలితాలు ఇలా ఉన్నాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆదాయం వృద్ధిలో, రెవెన్యూ పెరుగుదలలో దూకుడు కనబర్చింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆదాయం ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో (క్యూ2) ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.2,224 కోట్లకు చేరుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్‌) ఆర్థిక సంవత్సరం (సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన త్రైమాసికం) సంబంధించి ఆర్థిక, కార్యాచరణ ఫలితాలను విడుదల చేసింది. డిజిటల్ విస్తరణ, మంచి కంటెంట్‌కుతోడు 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాలతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అద్భుతమైన పనితీరును కనబరిచింది.

ఆర్థిక సంవత్సరం 2026 రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్ రెవెన్యూ.. గతంలో ఉన్న రూ. 1,969 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. అది రూ.2,225 కోట్లకు చేరుకుంది. ఈ వృద్ధికి జీ5 సబ్‌స్క్రిప్షన్ ఆదాయం ప్రధానంగా తోడ్పాటు అందించింది. రూ.1,023 కోట్ల నుంచి రూ.1,332.4 కోట్లకు పెరిగిందని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యూ2 ఫలితాలు ఇవే

నికర లాభం (నెట్‌ ప్రాఫిట్‌): రూ.77 కోట్ల నుంచి 37.7 శాతం తగ్గి రూ.48 కోట్లకు చేరుకుంది.

ఆదాయం (రెవెన్యూ): రూ.1,970 కోట్ల నుంచి 12.9 శాతం పెరిగి రూ.2,224 కోట్లకు చేరుకుంది.

ఇబిడా (EBITDA): రూ.160 కోట్ల నుంచి 46.6 శాతం తగ్గి రూ.85.5 కోట్లకు చేరుకుంది.

ఇబిడా మార్జిన్ (EBITDA Margin): 8.1 శాతం నుంచి తగ్గి 3.8 శాతం వద్ద నమోదైంది.

డిజిటల్ రంగంలో 'జీ' సుస్థిర స్థానం
డిజిటల్ రంగంలో ZEE5 ఓటీటీ సుస్థిర స్థానం సొంతం చేసుకుంది. ఓటీటీ రంగంలో జీ5 దూసుకెళ్తోంది. దీంతో కంపెనీలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నిలిచింది. క్యూ2 ఆర్థిక సంవత్సరం 27లో జీ5 రెవెన్యూ రూ.626 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 101 శాతం పెరుగుదల కనిపించింది. ఈ త్రైమాసికంలో జీ5లో 9 ఒరిజినల్ కంటెంట్‌లతోపాటు మొత్తం 34 కొత్త షోలు, సినిమాలు విడుదలయ్యాయి.

ఫిఫా వరల్డ్ కప్ 2026 మైలురాయి
స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో జీ నెట్‌వర్క్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది.

8 సంవత్సరాల భాగస్వామ్యం (2026 - 2034): రాబోయే 8 సంవత్సరాల పాటు ప్రధాన ఫిఫా ఈవెంట్‌లను 'జీ' నెట్‌వర్క్ ప్రసారం చేస్తోంది. క్రీడా ఈవెంట్‌లు స్ట్రీమింగ్ చేస్తుంది.

కొత్త వీక్షకుల రికార్డు: అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి మొత్తం వీక్షణ సమయం దాదాపు 50 బిలియన్ నిమిషాలుగా ఉంది.

లైవ్ మ్యాచ్‌ల క్రేజ్: మొత్తం ఫిఫా వీక్షణ సమయంలో 83 శాతం (సుమారు 40 కోట్ల మందికి పైగా) నేరుగా లైవ్ మ్యాచ్‌ల ద్వారానే వచ్చింది.

టెలివిజన్ నెట్‌వర్క్‌లు, వ్యూయర్‌షిప్ ఆధిపత్యం
ఫిఫా వరల్డ్ కప్ 2026ను తమ ప్రేక్షకులకు అందించడంతో భారతదేశంలోని 73 శాతం మంది వీక్షకులు 'జీ' బ్రాండ్‌ను ఎంతగానో అభినందించారు. బార్క్‌ డేటా ప్రకారం 2026 సంవత్సరంలో 24వ వారంలో జీ నెట్‌వర్క్ జాతీయ స్థాయిలో టీవీ నెట్‌వర్క్ వాటాలో 20.0 శాతం సాధించింది. గత 7 ఏళ్లలో ఇదే అత్యధికం. ఈ త్రైమాసికంలో సరిగమప (జీ టీవీ), దిల్ కీ రామ్ లీలా (జీ టీవీ), హోమ్ మినిస్టర్ (జీ మరాఠీ), దాద్గిరి అన్‌లిమిటెడ్ ఎస్‌11 (జీ సార్థక్) వంటి ప్రసిద్ధ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రస్థానం
జీ మ్యూజిక్ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ బేస్ 179 మిలియన్లకు మొత్తం వీడియో వ్యూస్ 59 బిలియన్లకు పెరిగాయి. ఈ త్రైమాసికంలో 'టాక్సిక్', 'హైవాన్', 'బట్వారా 1947' వంటి పాటలు, ఆల్బమ్‌లతో సహా తొమ్మిది హిందీ, 12 ప్రాంతీయ, 73 సింగిల్స్/ఆల్బమ్‌ల హక్కులు పొందాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News
Trending News