Bank Holidays November 2026: బ్యాంకులు సాధారణంగా ప్రతి నెలా ఆరు రోజుల పాటు మూసి ఉంటాయి. రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. దీనికి అదనంగా.. వివిధ ప్రాంతాలలో జరుపుకునే పండుగలకు కూడా సెలవులు ఉంటాయి. అయితే నవంబర్‌లో బ్యాంకులు ఏకంగా 16 రోజుల పాటు మూతపడనున్నాయి. దీపావళి, లక్ష్మీ పూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, కన్నడ రాజ్యోత్సవం వంటి పండుగల సందర్భంగా ..ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఆర్‌బిఐ సెలవులను ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం...
నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలోని ఆదివారాలు ఐదు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. అదేవిధంగా, నవంబర్ 14వ తేదీ రెండవ శనివారం నవంబర్ 28వ తేదీ నాల్గవ శనివారం కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.
దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా నవంబర్ 9న దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలలో లక్ష్మీ పూజ, విక్రమ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా నవంబర్ 10న బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
నవంబర్ 11న, సిక్కిం, మణిపూర్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో లక్ష్మీ పూజ, నింగోల్ చకౌబా, భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా సెలవు దినం పాటిస్తారు.
మేఘాలయలో వంగ పండుగ సందర్భంగా నవంబర్ 13న బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
బీహార్, జార్ఖండ్‌లలో ఛత్ పూజ సందర్భంగా నవంబర్ 16న బ్యాంకులకు సెలవు ఉంది.
ఉత్తరాఖండ్‌లో ఇగాస్ బగ్వాల్ పండుగ సందర్భంగా నవంబర్ 20న బ్యాంకులు మూసివేసి ఉంటాయి
మేఘాలయలో సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా నవంబర్ 23న బ్యాంకులు మూసివేసి ఉంటాయి
గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రాస పౌర్ణమి సందర్భంగా ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని బ్యాంకులు నవంబర్ 24న మూసివేసి ఉంటాయి
కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులు నవంబర్ 27న మూసివేయబడతాయి.
బ్యాంకులు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. చెక్కు క్లియరెన్స్, నగదు డిపాజిట్.. ఇతర బ్యాంకింగ్ పనుల కోసం బ్యాంకుకు వెళ్లవలసిన వారు పని దినాలలో వెళ్లవలసి ఉంటుంది.
Also Read: