• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Zee Entertainment: జీ టీవీకి భారీగా ప్రకటనలు.. గూగుల్, చాట్‌జీపీటీ కూడా అదే బాటలో..!

Zee Entertainment: జీ టీవీకి భారీగా ప్రకటనలు.. గూగుల్, చాట్‌జీపీటీ కూడా అదే బాటలో..!

Zee Entertainment Advertising: యాడ్స్ కంపెనీలను ఆకర్షించడంతో జీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ దుమ్ములేపుతోంది. జీ టీవీ ప్రతి నెలా 180కి పైగా ప్రకటనదారులను ఆకర్షిస్తోంది. గూగుల్, చాట్‌జీపీటీ వంటి టెక్ సంస్థలు కూడా తమ బ్రాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జీ ఛానళ్లను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని కంపెనీ తెలిపింది.

Written ByAshok Krindinti
Published: Nov 17, 2026, 14:59 IST|Updated: Nov 17, 2026, 15:03 IST
joinshare
Zee Entertainment: జీ టీవీకి భారీగా ప్రకటనలు.. గూగుల్, చాట్‌జీపీటీ కూడా అదే బాటలో..!

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Entertainment Advertising: ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి పోటీ పెరుగుతున్నా.. టెలివిజన్‌కు మాత్రం ఆదరణ తగ్గట్లేదని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. తమ ప్రధాన హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ జీ టీవీకి ప్రతి నెలా 180కి పైగా ప్రకటనదారులు భాగస్వాములవుతున్నారని తెలిపింది. గూగుల్, ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వంటి ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్లు కూడా తమ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు టీవీ కార్యక్రమాలను వినియోగించుకుంటున్నాయని పేర్కొంది. జీ టీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు, ప్రైమ్‌టైమ్‌లో వస్తున్న రేటింగ్స్ ప్రకటనదారులను ఆకర్షిస్తున్నాయని వివరించింది.

ముఖ్యంగా రాత్రి 7.30 నుంచి 10.30 గంటల మధ్య ప్రసారమయ్యే కార్యక్రమాల్లో అర్బన్ ప్రైమ్‌టైమ్ విభాగంలో జీ టీవీ అగ్రస్థానంలో ఉందని సంస్థ తెలిపింది. ఈ సమయంలోని వివిధ టైమ్ స్లాట్లలోనూ ఛానల్ మంచి ప్రదర్శన కనబరుస్తోందని పేర్కొంది. పే హిందీ జీఈసీ విభాగంలో అత్యధిక ఆదరణ పొందుతున్న తొలి మూడు కార్యక్రమాలు కూడా తమ ఛానల్‌లోనే ఉన్నాయని వెల్లడించింది. 'తుమ్ సే తుమ్ తక్', 'గంగా మై కీ బేటియాన్', 'వసుధా' సీరియళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపింది.

భారత్‌లో టెలివిజన్ ద్వారా దాదాపు 90 కోట్ల మంది ప్రేక్షకులకు చేరుకునే అవకాశం ఉందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ పేర్కొంది. తమ లీనియర్ టీవీ ఛానళ్ల నెట్‌వర్క్ ద్వారా 85 కోట్ల మందికి పైగా ప్రేక్షకులను చేరుకుంటున్నట్లు వెల్లడించింది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథలు, వివిధ భాషల్లో ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం కలుగుతోందని వివరించింది. ఈ క్రమంలో గూగుల్ తన ఏఐ ఆధారిత సేవలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు జీ టీవీ కార్యక్రమాలను ఉపయోగించుకుంది. వంటకాల కోసం వెతకడం, కుటుంబ వేడుకలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడం వంటి రోజువారీ పనుల్లో గూగుల్ సేవలు ఎలా ఉపయోగపడతాయో కార్యక్రమాల్లోని సన్నివేశాల ద్వారా చూపించింది.

అలాగే చాట్‌జీపీటీ కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన పలు భాషా ఛానళ్లలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. జీ టీవీలో 'వసుధా', 'జగద్ధాత్రి', జీ తెలుగులో 'జగద్ధాత్రి', 'జయం', జీ కన్నడలో 'అన్నయ్య', 'లక్ష్మీ నివాస', జీ బంగ్లాలో 'పరిణీత', 'జోవర్ భాటా', జీ మరాఠీలో 'వీణ్ దోఘతలా హీ టుటేనా', 'కమలి' వంటి సీరియళ్ల ద్వారా చాట్‌జీపీటీ వినియోగాన్ని పరిచయం చేసింది. ఇంటి పనులు, రోజువారీ నిర్ణయాలు, వేడుకల నిర్వహణ, కొత్త విషయాల అన్వేషణలో ఏఐ ఎలా తోడ్పడుతుందో కథల్లో భాగంగా చూపించినట్లు సంస్థ తెలిపింది.

ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఎనిమిది ఫిక్షన్ కార్యక్రమాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించింది. 'సిట్రోయెన్ కా కంఫర్ట్ హీ అలగ్ హై' అనే సందేశాన్ని కుటుంబ కథనాల్లో భాగం చేస్తూ, కారు కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలను ప్రేక్షకులకు చేరువ చేసింది. మరోవైపు 'సా రే గ మ ప' వంటి పాపులర్ షోలను కూడా ప్రకటనదారులు తమ ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్గమ్ డిటర్జెంట్ 'పర్ఫెక్ట్ గాయకి ఆఫ్ ది డే' వంటి విభాగాల ద్వారా తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది. మారుతీ సుజుకీ సహ ప్రాయోజకుడిగా వ్యవహరిస్తూ కార్యక్రమంతో అనుబంధాన్ని పెంచుకుంది. వినియోగ వస్తువులు, ఈ-కామర్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు సహా పలు రంగాల సంస్థల నుంచి తమ ఛానళ్లకు ప్రకటనలపై ఆసక్తి కనిపిస్తోందని జీ తెలిపింది.

టెలివిజన్‌తో పాటు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ తమ ఛానళ్లు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని జీ సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 2026కు సంబంధించిన కనెక్ట్ ఇన్‌సైట్స్ డేటా ప్రకారం.. జీ టీవీ, జీ మరాఠీ, జీ తమిళ్, జీ తెలుగు, జీ బంగ్లా తమతమ మార్కెట్లలో డిజిటల్ ఎంగేజ్‌మెంట్ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. Tubular డేటా ప్రకారం.. జీ టీవీ, జీ మరాఠీ, జీ బంగ్లా వీడియో వ్యూస్‌లో తమ మార్కెట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. జీ టీవీకి దాదాపు 290 కోట్ల వీడియో వ్యూస్ రాగా.. జీ కన్నడకు 230 కోట్లకు పైగా వ్యూస్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. వినోద కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులతో అనుబంధాన్ని పెంచుకుంటూనే.. ప్రకటనదారులకు కూడా మెరుగైన అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టినట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. టీవీ, డిజిటల్ మాధ్యమాలను కలిపి మరింత విస్తృతంగా ప్రేక్షకులను చేరుకోవడం తమ వ్యూహమని సంస్థ పేర్కొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News