SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.40 వేల వరకు జీతం!

Kvic Recruitment 2026: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇందులో ఖాళీగా ఉన్న మొత్తం 50 ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే, వీటినికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 21, 2026, 05:36 PM IST | Updated: Sep 21, 2026, 05:38 PM IST
Image Credit: రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.40 వేల వరకు జీతం!
Join

Kvic Recruitment 2026 News: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఎప్పటి నుంచో మంచి జాబ్‌ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) పరిధిలో ఉన్న ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. యంగ్ ప్రొఫెషనల్‌లో పాటు సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌కి సంబంధించిన విభాగాల్లో మొత్తం 50 ఖాళీ పోస్టులను ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. అయితే, ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. KVICలో మొత్తం కేటగిరీల వారీగా 50 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. యంగ్ ప్రొఫెషనల్స్‌ కోసం 20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అకౌంట్స్, ఆడిట్‌తో పాటు హెచ్ఆర్ అడ్మిన్, లీగల్, మార్కెటింగ్, డిజైన్, పబ్లిసిటీ తదితర విభాగాల్లో ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇక మరో 15 పోస్టులు కన్సల్టెంట్స్ విభాగంలో ఖాళీ ఉన్నాయి. దీంతో పాటు 15 పోస్టులు సీనియర్ కన్సల్టెంట్స్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి..

విద్యార్హతల వివరాల్లోకి వెళితే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్టుకు సంబంధించిన విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో తప్పకుండా ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత రంగాల్లో కూడా నిర్దేశిత అనుభవం తప్పనిసరని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఇక వయోపరిమితి వివరాల్లోకి వెళితే.. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లు ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా సీనియర్ కన్సల్టెంట్ అభ్యర్థుల వయస్సు 39 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇక కన్సల్టెంట్ పోస్టులకు 40 నుంచి 65 ఏళ్ల వరకు అర్హులని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దీంతో పాటు రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇక జీతం వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు జీతం ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. దీంతో పాటు సంస్థ నిబంధనల ప్రకారం.. ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. కన్సల్టెంట్ పోస్టులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) మార్గదర్శకాలకు అనుగుణంగా గౌరవ వేతనం కూడా నిర్ణయిస్తారు. ఇక ఈ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష ఉండని నోటిఫికేషన్‌లో తేల్చి చెప్పారు. అభ్యర్థులు పంపిన దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు KVIC అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఆన్‌లైన్ దరఖాస్తులకు 2026 సెప్టెంబర్ 30 చివరి తేదీని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వెల్లడించింది..
 

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES