Actress: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ మరింత పెరిగిపోయింది. వారు చేసే ప్రతి పనిని గమనిస్తూ, కొన్నిసార్లు వాస్తవాలు తెలుసుకోకుండానే కామెంట్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా నటీనటుల శరీరాకృతి, వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లు చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా సీనియర్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయితే ఆమె మాత్రం వాటిని సీరియస్‌గా తీసుకోకుండా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న నీనా గుప్తా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్, ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటిస్తూ ఇప్పటికీ బిజీగా ఉన్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగానూ పనిచేసిన ఆమె.. తన అభిప్రాయాలను నేరుగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు.
ఇటీవల ఓ కార్యక్రమానికి చీరలో హాజరైన నీనా గుప్తా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె పొట్ట భాగం కాస్త కనిపించడంతో కొందరు నెటిజన్లు అసభ్యకరంగా, నిరాధారంగా కామెంట్లు చేశారు. ఏకంగా 67 ఏళ్ల వయసులో నీనా గుప్తా గర్భవతి అయ్యారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం ఆమె టీమ్ ద్వారా తెలుసుకున్న నీనా గుప్తా నవ్వుకున్నారట.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై స్పందించిన ఆమె.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరినైనా, ఏ విషయాన్నైనా ట్రోల్ చేయడం చాలా సులభంగా మారిపోయిందని అన్నారు. చీర సర్దుకునే సమయంలో పొట్ట కాస్త ఎక్కువగా కనిపించినంత మాత్రాన దాన్ని ప్రెగ్నెన్సీగా ఊహించుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు, తనను గర్భవతిగా ప్రచారం చేస్తున్న వారికి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ‘‘నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని వాళ్లకు చెప్పండి’’ అంటూ సరదాగా స్పందించినట్లు తెలిపారు. ఎవరైనా కాస్త బరువు పెరిగినా దానికి కారణం ప్రెగ్నెన్సీ అని చెప్పేయాలా అంటూ ప్రశ్నించారు.
వ్యక్తిగత విషయాలపై అనవసరంగా ప్రశ్నలు అడిగేవారికి కూడా తాను తిరిగి ప్రశ్నిస్తానని నీనా గుప్తా స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోలింగ్‌ను భయపడకుండా హాస్యంతో ఎదుర్కొన్న నీనా గుప్తా తీరుపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook