Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో రోజురోజుకూ గొడవలు పెరుగుతున్నాయి. రెండో వారంలో పెద్దగా కనిపించని స్రిష్టి, మూడో వారంలో మాత్రం ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. నామినేషన్స్ సమయంలో తోటి కంటెస్టెంట్ సుధీర్‌తో ఆమెకు పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో స్రిష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుధీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా రామ్ ప్రసాద్ తనకు ఉన్న మరో నామినేషన్ అవకాశాన్ని రోహిత్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్, సుధీర్‌ను నామినేట్ చేస్తూ అతని పాత విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా వర్షిణి సుధీర్‌ను ప్రభావితం చేస్తోందనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఈ సమయంలో స్రిష్టి పేరు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
సుధీర్ మాట్లాడిన కొన్ని మాటలపై స్రిష్టి తీవ్రంగా స్పందించింది. తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వెన్నుపోటు పొడిచినట్లు సుధీర్ మాట్లాడుతున్నాడంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కోపంలో సుధీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతన్ని కొడతానని, పళ్లు రాలగొడతానని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గొడవ మరింత పెరగడంతో సుధీర్ కూడా త్రిగుణ్ పేరును ప్రస్తావించాడు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న ఇతర కంటెస్టెంట్లు వెంటనే స్పందించి వారిని ఆపారు. మరోవైపు సుధీర్, అమన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
ఇంతకుముందు స్రిష్టి తనతో ఫ్రెండ్షిప్ ముగిసిందని చెప్పినప్పుడు, సుధీర్ తనకు స్వేచ్ఛ వచ్చినట్లు వ్యాఖ్యానించాడు. అయితే ఆ మాటలు స్రిష్టిని ఉద్దేశించి కాదని, త్రిగుణ్ ప్రభావం నుంచి బయటపడటం గురించి అన్నానని తర్వాత వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ విషయం మరింత గందరగోళంగా మారింది. ఈ మొత్తం ఘటనలో స్రిష్టి ఆవేశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఇద్దరికీ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారో ఆసక్తిగా మారింది.
Also Read: నటుడిగా 48 వసంతాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్.. చిరు భావోద్వేగమైన పోస్ట్..
Also Read: Kajal Aggarwal: విడాకులపై కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు.. దూరానికి అదే కారణమంటూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.