SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vivek Chepuri: కల్ట్ తో ఒక్కసారిగా ఫేమస్.. ఇప్పుడు హీరోగా వివేక్ చేపూరి గ్రాండ్ ఎంట్రీ!

Vivek Chepuri: టాలీవుడ్‌లో హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అవకాశాలు రావాలి. కానీ కొంతమంది నటులు మాత్రం చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో యువ నటుడు వివేక్ చేపూరి ఒకరు. విలన్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ యంగ్ యాక్టర్ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Written By Vishnu Priya
Published: Nov 06, 2026, 09:40 PM IST | Updated: Nov 06, 2026, 10:02 PM IST
Join

Vivek Chepuri: 2019లో విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో రవి అనే ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. హీరో విశ్వక్ సేన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా తన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత మంచి నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం కొనసాగించారు.

ఇక తాజాగా విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్ట్’ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు ఏడేళ్ల తర్వాత విశ్వక్ సేన్‌తో కలిసి పనిచేసిన వివేక్.. ఇందులో ఇషాన్ అనే పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. సినిమాకు సంబంధించిన చర్చల్లో వివేక్ పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.

సోషల్ మీడియాలో కూడా వివేక్‌కు మంచి స్పందన వస్తోంది. ఆయన నటనకు సంబంధించిన వీడియోలు, ఫ్యాన్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు వివేక్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా పరిచయమైన ఆయన ఇప్పుడు కొత్త గుర్తింపు దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, వివేక్ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఓ కొత్త చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ప్రియేష్ గురుస్వామి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్‌ను నవంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విలన్ పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు హీరోగా కొత్త అడుగు వేస్తున్న వివేక్ చేపూరి తన తదుపరి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
 

Read More: Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

 

Read More:‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!! 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES