SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

Prabhas Fauzi Movie Leaked: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రం నుంచి లీకేజీ ఒకటి ఇంటర్నెట్‌లోకి విడుదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఒక 1.09 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Written By Harish Darla
Published: Oct 05, 2026, 05:37 PM IST | Updated: Oct 05, 2026, 05:41 PM IST
Join

Prabhas Fauzi Movie Leaked: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'ఫౌజీ' ఒకటి. 'సీతారామం' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 1940ల కాలం నాటి పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ కథలో ప్రీ-ఇండిపెండెన్స్ (స్వాత్వంత్ర్యం రాకముందు) కాలానికి సంబంధించి వాస్తవ సంఘటనలను మేళవించి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వీడియో లీక్ సంచలనం..
షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే 'ఫౌజీ' సినిమా నుంచి ఒక సంచలన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి దాదాపు ఒక నిమిషం 9 సెకన్ల నిడివి గల ఒక వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో లీక్ అయి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఆర్మీ క్యాంప్‌లో జవాన్లంతా ఒకచోట చేరి, చేతుల్లో తుపాకులు పట్టుకుని ఒక పాటకు సరదాగా, ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. వందలాది మంది జవాన్లు ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియో క్లిప్ సినిమాలో భాగమా కాదా, అలాగే ఇది నిజంగా లీక్ అయిందా లేక ఫేకా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. సినిమా స్వాతంత్ర్యం రాకముందు కాలానికి సంబంధించినది అయితే లీక్ అయిన వీడియో మాత్రం బాలీవుడ్‌ మూవీ 'ఫాంటమ్' సినిమాలోని 'ఆఫ్ఘానీ జిలేబి' అనే పాట ప్లే అవుతున్నట్లు కనిపించింది. దీంతో ఆ క్లిప్ సినిమాలో భాగం కాదని అర్థం అవుతోంది.

విడుదల తేదీ అప్‌డేట్..
ఈ చిత్రాన్ని నిర్మాతలు మొదట ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడింది. దీని తదుపరి రిలీజ్ డేట్‌ను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది. అయితే ఇది దేశభక్తి నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో, వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

నటీనటులు, ఇతర విశేషాలు..
ఈ సినిమాలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటిస్తుండగా, ఆయన సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉండబోతోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES