SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Katrina Kaif Latest: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కత్రినా కైఫ్..పెళ్లైన తర్వాత కత్రినాకు ఏమైంది? ఫ్యాన్స్ షాక్!

Katrina Kaif Latest Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ, తాజాగా విపరీతంగా బరువు పెరిగింది. ఒకప్పటి సినిమాల్లో సైజ్ జీరోతో కుర్రకారును అలరించిన ఈ భామ..ఓ కాన్పు తర్వాత బరువు పెరిగి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె భర్త విక్కీ కౌషల్‌తో ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written By Harish Darla
Published: Sep 15, 2026, 07:11 PM IST | Updated: Sep 15, 2026, 07:21 PM IST
Join

Katrina Kaif Latest Photos: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ 14 ఏళ్ల వయసులో మోడలింగ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, టాలీవుడ్‌లో 'మల్లీశ్వరి' సినిమా ద్వారా తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2021లో నటుడు విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న ఈ భామ, ఇటీవల వైరల్ అవుతున్న ఫోటోలలో గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కత్రినా కైఫ్ 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. లండన్‌లో జరిగిన ఒక ఫ్యాషన్ షో సందర్భంగా భారతీయ నిర్మాత కైజాద్ గుస్తాద్ దృష్టిలో పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బూమ్' (2003) సినిమా ద్వారా కత్రినా ఇండస్ట్రీకి పరిచయమైంది కత్రినా కైఫ్. అయితే ఈ తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, కత్రినా అందం, నటన, ఆకర్షణీయమైన రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

టాలీవుడ్ ఎంట్రీ..
బాలీవుడ్‌లో పరిచయమైనప్పటికీ, కత్రినాకు మొదటి విజయం మాత్రం తెలుగు చిత్రసీమలోనే లభించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'మల్లీశ్వరి' (2004) ద్వారా ఆమె టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో యువరాణి పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి 'అల్లరి పిడుగు' సినిమాలో నటించినా, అది కమర్షియల్ డిజాస్టర్‌గా నిలవడంతో తెలుగులో మరో సినిమా చేయలేదు.

బాలీవుడ్ విజయం, స్టార్ హోదా.. 
తెలుగు హిట్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన కత్రినా, 2005లో 'మైనే ప్యార్ క్యుం కియా' సినిమాతో తొలి బాలీవుడ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నమస్తే లండన్ (2007), రేస్ (2008), రాజ్ నీతి (2010), జిందగీ నా మిలేగీ దోబారా (2011), ఏక్ థా టైగర్ (2012), ధూమ్ 3 (2013) వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించింది. ఒక దశలో బాలీవుడ్‌లో కత్రినా యుఫోరియా నడవగా, అగ్ర కథానాయకులు సైతం తమ సినిమాల్లో ఆమెనే కావాలని డిమాండ్ చేసేవారు.

వ్యక్తిగత జీవితం, ఆస్తులు..
2021లో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా ప్రేమించి పెళ్లి చేసుకుంది. విక్కీ కౌశల్ గత రెండు, మూడేళ్లుగా వరుస హిట్లతో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ నికర ఆస్తుల విలువ రూ.220 కోట్లకు పైగానే ఉంటుంది.

పెళ్లి తర్వాత కూడా ఎంతో అందంగా కనిపించిన కత్రినా, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో చాలా మారిపోయి కనిపించింది. కాస్త లావుగా మారి, తన పాత చార్మింగ్ లుక్ కోల్పోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఒకప్పటి బ్యూటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి!

Also REad: 'ఆదర్శ కుటుంబం ఏకే 47' టీజర్ వచ్చేసింది! వెంకీ-త్రివిక్రమ్ కాంబో హిట్ కొడుతుందా?

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES