Kavya Maran Wedding Gold Ring Gift: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాన్య వర్గానికి చెందిన కావ్యా మారన్ ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్‌ను కావ్యా మారన్ పెళ్లారు. ఈ వివాహం విదేశాల్లో జరగ్గా.. ప్రస్తుతం వారి పెళ్లి రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సన్ గ్రూప్ ఉద్యోగులకు అందించిన ప్రత్యేక బహుమతులు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఉద్యోగులకు బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోల ప్రకారం.. కొంతమంది ఉద్యోగులకు ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్ బాక్సులు అందించారు. వాటిని తెరిచి చూసిన ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాక్సుల్లో వివాహ వేడుకకు సంబంధించిన కార్డు, చాక్లెట్లు, బంగారు ఉంగరం ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. తమకు బంగారు నాణేలు అందుతాయని ముందుగా ఊహించామని, అయితే ఉంగరాలు రావడంతో ఆనందంగా ఆశ్చర్యపోయామని ఓ ఉద్యోగి వీడియోలో వెల్లడించారు.
SRH Owner Kavya Maran presents Gold Ring to all the Sun Group Employees. Reception on November 25. https://t.co/eA6I4R2U1V
— SportsGully Cricket 🏏 (@sportsgullycric) November 20, 2026
ఈ బహుమతులపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంతమంది ఉద్యోగులకు ఈ కానుకలు పంపిణీ చేశారు? ఒక్కో ఉంగరం ఎంత బరువు ఉంటుంది? వాటి మార్కెట్ విలువ ఎంత? అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. సన్ గ్రూప్ నుంచి ఈ వివరాలకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అందువల్ల బహుమతుల సంఖ్య, విలువపై వస్తున్న అంచనాలను అధికారిక వివరాలుగా పరిగణించలేం.
ఇదిలా ఉండగా, ఉద్యోగుల కోసం నవంబర్ 25న ప్రత్యేక లంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గిఫ్ట్ బాక్సులోని కార్డులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కూడా ఉద్యోగుల మధ్య ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు, నవంబర్ 21న చెన్నైలో కావ్యా మారన్, అనిరుధ్ వివాహ రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులకు బంగారు ఉంగరాలు అందించినట్లు వైరల్ అవుతున్న ఈ వార్త, కావ్యా మారన్ పెళ్లి వేడుకల చుట్టూ మరింత ఆసక్తిని పెంచింది. అధికారిక వివరాలు వెలువడితే బహుమతుల పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.